ఏపీ అనే కాదు ఏ రాష్ట్రంలో అయినా అధికారంలో ఉన్న పార్టీ వైపు మొగ్గు చూపుతూ అన్నం పెట్టిన పార్టీకి అన్యాయం చేసి అధికారం కోసం కొట్టేసుకునే రాజకీయనేతలు కోకొల్లలు. తెలంగాణాలో కాంగ్రెస్ ని BRS ప్రభుత్వంలో ఉన్నప్పుడు బండబూతులు తిట్టిన వాళ్ళంతా కాంగ్రెస్ ప్రభుత్వంలోకి రాగానే BRS ని వదిలేసి కాంగ్రెస్ లో చేరుతున్నారు.
ఇక ఏపీలో గతంలో టీడీపీలో నుంచి వైసీపీ ప్రభుత్వంలోకి వెళ్లి పదవులు పొంది అధికారాన్ని అనుభవించినవారు, చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ లను తిట్టిన వాళ్ళు ఇప్పడు వైసీపీ కి అధికారం పోయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైసీపీ కి రాజీనామా చేసి కూటమి ప్రభుత్వంలోకి చేరుతున్నారు.
ఇక్కడ రాజకీయాల్లో విలువలు ఉండవు, గతంలో టీడీపీవాళ్ళు వైసీపీలో చేరితే జగన్ వారికి మంత్రి పదవులు ఇచ్చాడు, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోకి వచ్చే వైసీపీ నేతలకు పదవులు ఇస్తారు. అలాంటి హామీలతో నేతలు పార్టీ కండువాలు మార్చేస్తున్నారు.
నిన్న వైసీపీకి రాజీనామా చేసిన అవంతి, గ్రంధి ఎపిసోడ్స్ తర్వాత వైసీపీ వాళ్ళు సోషల్ మీడియా వేదికగా రకరకాలుగా స్పందిస్తున్నారు.
AP రాజకీయాలు ఒక్క ముక్కలో
మన పార్టీలో ఉంటే ఎలివేషన్స్ ఇస్తాం
పార్టీ మారితే వాడినే తిడతాం
ఖర్మకాలి మళ్ళీ వాడు పార్టీలోకి వస్తే మళ్ళీ పదవులు, ఎలివేషన్స్
వాడు మాత్రం సంపాదించుకొని హాయిగా ఎంజాయ్ చేస్తాడు జ
పక్కింటి నుండి వచ్చిన ఇలాంటి వాళ్ళ అందరికి మా గ్రేట్
@ysjagan అన్న మంత్రి పదవులు ఇచ్చి నిజమైన తనను ప్రేమించే నిజమైన ఏ స్వార్థం లేని కార్యకర్తలను దూరం పెట్టాడు.. అంటూ స్పందిస్తున్నారు.