బిగ్ బాస్ సీజన్ 8 అప్పుడే గ్రాండ్ ఫినాలే కి దగ్గరైంది. అప్పుడే ఏమిటి.. ఎప్పుడెప్పుడు బిగ్ బాస్ 8 ఫినిష్ అవుతుందా అని చాలామంది ఎదురు చూస్తున్నారు. డిసెంబర్ 15 ఆదివారం బిగ్ బాస్ 8 గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ రాబోతుంది. ఈ సీజన్ విన్నర్ గా నిఖిల్ నిలుస్తాడా లేదంటే గౌతమ్ అవుతాడా అనే సస్పెన్స్ కనిపిస్తుంది.
సీరియల్స్ కి సంబంధం లేని బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ అంతా గౌతమ్ విన్నర్ అవ్వాలని కోరుకుంటుంటే.. సీరియల్ బ్యాచ్ మొత్తం నిఖిల్ విన్నర్ అవ్వాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. ప్రస్తుతం ఎక్కువగా నిఖిల్ సీజన్ 8 విన్నర్ అయ్యే ఛాన్సెస్ కనబడుతున్నాయి. ఇక గ్రాండ్ ఫినాలే కి గెస్ట్ ఎవరొస్తారో అనే విషయంలో సస్పెన్స్ మొదలైంది.
గ్రాండ్ ఫినాలే ఈవెంట్ మధ్యలో మూవీ టీమ్స్ తమ సినిమాలు ప్రమోట్ చేసుకుంటాయి. ఫైనల్ గా విన్నర్ కి ట్రోఫీ అందించే గెస్ట్ పై రాకరకాల ఊహాగానాలు నడుస్తున్నాయి. గతంలో మెగాస్టార్ వచ్చినా కొన్ని సీజన్స్ నుంచి ఏ స్టార్ బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్ కి రావట్లేదు. సోషల్ మీడియాలో రకరకాల పేర్లు వినిపించడం చివరికి ఆడియన్స్ ను డిజప్పాయింట్ అయ్యేలా చెయ్యడమే జరుగుతుంది.
మరి ఈసారి వెంకటేష్, లేదంటే పుష్ప తో సిక్స్ కొట్టిన అల్లు అర్జున్ సీజన్ 8 గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కి గెస్ట్ గా వచ్చి విన్నర్ కి ట్రోఫీ ఇస్తారని ప్రచారం జరుగుతుంది. మరి ఇది నిజమా.. లేదంటే ఈసారి కూడా నాగ్ చేతుల మీదగానే అది జరుగుతుందా అనేది తెలియాల్సి అది.