Advertisementt

వైరల్ - స్పిరిట్ లో ప్రభాస్ లుక్

Thu 12th Dec 2024 10:36 PM
prabhas  వైరల్ -  స్పిరిట్ లో ప్రభాస్ లుక్
Viral - Prabhas look in spirit వైరల్ - స్పిరిట్ లో ప్రభాస్ లుక్
Advertisement
Ads by CJ

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాజా సాబ్, అలాగే హను రాఘవపూడి ఫౌజీ చిత్రాల షూటింగ్స్ తో చాలా బిజీగా ఉన్నారు. రాజా సాబ్ లో బ్రేక్ దొరగ్గానే ఫౌజీ సెట్స్ లోకి, అటు ఫౌజీ నుంచి రాజా సాబ్ సెట్స్ కి ప్రభాస్ పరుగులు పెడుతున్నారు. ఈలోపులో సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ సెట్స్ లోకి వెళ్లాల్సిన సమయం వచ్చేసింది. 

సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ కోసం బౌండ్ స్క్రిప్ట్ తో వెయిట్ చేస్తున్నారు. ప్రభాస్ ఎప్పుడెప్పుడు వస్తారా... స్పిరిట్ ఎప్పుడెప్పుడు మొదలు పెడదామా అని. జనవరి నుంచి స్పిరిట్ రెగ్యులర్ షూట్ కి వెళ్లే ఛాన్స్ ఉంది. ఈ చిత్రంలో ప్రభాస్ మొదటిసారి పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. మరి పోలీస్ గెటప్ లో తన హీరో ఎలా ఉంటారో అని ప్రభాస్ అభిమానులు ఆత్రపడని క్షణం లేదు. 

తాజాగా స్పిరిట్ లో ప్రభాస్ పోలీస్ లుక్ అంటూ ఓ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పోలీస్ అధికారిగా ప్రభాస్ ఫిట్ గా కనిపించడమే కాదు, ఆ లుక్ లో డిఫ్రెంట్ గా కనిపించడంతో ఆయన అభిమానులను ఎగ్జైట్ చేసింది. దానితో ఆ పిక్ ని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తూ హడావిడి మొదలు పెట్టేసారు. 

Viral - Prabhas look in spirit:

Prabhas Spirit look 

Tags:   PRABHAS
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ