నాగచైతన్య-శోభితలు ఈ నెల 4 న హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో వివాహం చేసుకున్నారు. కేవలం కుటుంబ సభ్యులు, ఇంకా కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ పెళ్లి వేడుకలో శోభిత సాంప్రదాయబద్దంగా కంచి పట్టు చీరలో పెళ్లి కూతురుగా మెరిసిపోయింది. నాగ చైతన్య-శోభితల పెళ్లిలో కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ సోషల్ మీడియాలో ఇంకా వైరల్ అయ్యాయి.
ఇక పెళ్లయిన వారానికే చైతన్య-శోభితలు ముంబై లో తేలారు. శోభిత ఇప్పటికే ఇంటెర్నేషనల్ ప్రాజెక్ట్స్ లో నటిస్తుంది. నాగ చైతన్య తండేల్ చిత్రం పూర్తి చెసే పనిలో ఉన్నారు. వీళ్ళు ఇద్దరూ పెళ్లి తర్వాత జంటగా ముంబై వెళ్లడానికి ప్రధాన కారణం అక్కడ ముంబై లో జరిగిన ఓ వివాహ రిసెప్షన్ కోసం ఈ కొత్త జంట ముంబై వెళ్లారు.
అనురాగ్ కశ్యప్ కుమార్తె పెళ్ళిలో నాగ చైతన్య-శోభితా లు సందడి చేసిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బాలీవుడ్ సెలబ్రిటీస్ మధ్యన శోభిత చక్కటి డ్రెస్సింగ్ స్టయిల్లోకనిపించగా, చైతు సూట్ లో కనిపించారు.