బిగ్ బాస్ సీజన్ 8 లో టాప్ 5 వీక్ నడుస్తుంది. టాప్ 5 తో ఏమి చెయ్యలేని బిగ్ బాస్ యాజమాన్యం ఈ వారమంతా స్టార్ మా సీరియల్ ఆర్టిస్టులను బిగ్ బాస్ హౌస్ లోకి పంపించి ఏదో సందడి చెయ్యాలని ట్రై చేసినా ప్రేక్షకులు బాగా బోర్ ఫీలవుతున్నారు. టాప్ 5 లో ఉన్న అవినాష్, నిఖిల్, గౌతమ్, నబీల్, ప్రేరణ లలో టాప్ 2 ఎవరనేది ఆల్మోస్ట్ ఆడియన్స్ ఓ అంచనాకు వచ్చేసారు.
అందరికన్నా ముందే ఫైనలిస్ట్ గా టాప్ 5 లో అడుగుపెట్టిన అవినాష్ ని బయట ఉన్న ఆడియన్స్ అంతగా పట్టించుకోవడం లేదు. అందుకే టాప్5 లో అతని స్థానాన్ని 5 కి నెట్టేసారు. టాప్ 4 లో నబీల్, టాప్ 3 లో ప్రేరణ కు వరస స్థానాలను ఇచ్చారు ప్రేక్షకులు.
ఇక ఈ సీజన్ లో టాప్ 2లో నిఖిల్-గౌతమ్ నిలవబోతున్నారు. ఈ సీజన్ కప్ కూడా గౌతమ్ లేదంటే నిఖిల్ ఇద్దరిలో ఎవరో ఒకరికి కాదు గౌతమ్ ని రేస్ నుంచి తప్పించి అతన్ని రన్నర్ గా ఉంచే ప్లాన్ చేస్తున్నారని, ఎలాగైనా నిఖిల్ ని విన్నర్ ని చెయ్యాలని యాజమాన్యం స్ట్రాంగ్ గా ఉన్నట్లుగా కూడా వార్తలొస్తున్నాయి. టాప్ 2 లో మాత్రం నిఖిల్-గౌతమ్ ఉంటారు, ఇది ఫిక్స్.