గత ఏడాది వరస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శ్రీలీల ఈఏడాది మాత్రం నిన్నమొన్నటివరకు సైలెంట్ గానే ఉంది. రాబిన్ హుడ్, రవితేజ మాస్ జాతరలో నటిస్తున్నప్పటికీ ఈమధ్యన పుష్ప ద రూల్ కిస్సిక్ స్పెషల్ సాంగ్ తో తెగ ట్రెండ్ అయ్యింది. పుష్ప ద రూల్ ప్రమోషన్స్ లో అందాలు ఆరబోస్తూ చెలరేగిపోయింది.
ఇప్పుడు శ్రీలీల సుడి తిరుగుతోంది. అదేనండి మళ్ళీ టాలీవుడ్ ఆఫర్స్ అమ్మడు తలుపు తడుతున్నాయి. ఇప్పటికే నాగ చైతన్య-కార్తీక్ దండు కాంబోలో మొదలు కాబోయే చిత్రంలో శ్రీలీల ని హీరోయిన్ అంటున్నారు. తాజాగా సిద్దు జొన్నలగడ్డ చిత్రంలోనూ శ్రీలీల కి హీరోయిన్ గా అవకాశం వచ్చినట్లుగా తెలుస్తోంది.
టిల్లు స్క్వేర్ తో బిగ్గెస్ట్ హిట్ కొట్టిన సిద్దు జొన్నలగడ్డ ప్రస్తుతం రెండు ప్రాజెక్ట్స్ లు పట్టాలెక్కించాడు. అయితే సిద్దు సరసన శ్రీలీల నటించబోయే ప్రాజెక్ట్ వివరాలు మాత్రం తెలియల్సి ఉంది.