రేపు పెళ్లి అంటే ఎలా ఉండాలి, ఇల్లంతా సందడిగా, ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ తో హడావిడిగా కనిపించాలి. సామాన్యులే హల్దీ, మెహిందీ, సంగీత్ వేడుకలంటూ పెళ్ళికి ముందు తెగ హడావిడి చేస్తుంటే సెలెబ్రిటీ అయితే ఆ సందడి సోషల్ మీడియాలో వేరే లెవల్ లో కనిపిస్తుంది. పెళ్ళికి ముందు ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో హల్దీ ఫంక్షన్, మెహిందీ సెలెబ్రేషన్స్ అంటూ ఎంత హడావిడి కనిపించాలి.
కానీ నటి కీర్తి సురేష్ విషయంలో అవేమి కనిపించడం లేదు. ఈ నెల 12న అంటే రేపు గోవాలో తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోనీని ప్రేమ వివాహం చేసుకోబోతున్న కీర్తి సురేష్ ఇంకా పెళ్లి మూడ్ లోకి రాలేదా? లేదంటే సీక్రెట్ గా పెళ్లి వేడుకలు ముగించేస్తుందో అనేది అర్ధం కాక ఆమె అభిమానులు కళ్ళు కాయలు కాచేలా వెయిట్ చేస్తున్నారు.
నిన్నమొన్నటివరకు కీర్తి సురేష్ తన హిందీ మూవీ బేబీ జాన్ ప్రమోషన్స్ లోనే కనిపించింది. సోషల్ మీడియాలోనూ ఆ సినిమా ప్రమోషన్స్, అలాగే గ్లామర్ పిక్స్ వదులుతుంది కానీ.. ఇప్పటివరకు ఆమె పెళ్ళికి సంబంధించి ఏ పిక్ చెయ్యలేదు. డిసెంబర్ 9 నే కీర్తి సురేష్, ఆంటోని ఫ్యామిలీస్ గోవాకు వెళుతున్నట్టుగా చెప్పారు. అక్కడేమి ఆ సందడి కాన రావడం లేదు.
గోవాలోని లగ్జరీ రిసార్ట్స్ లో కీర్తి సురేష్ వివాహం జరగబోతుంది. దానికి కంటిన్యూగా గోవాలోని పురాతన చర్చ్ లో క్రిస్టియన్ సంప్రదాయంలో వివాహం చేసుకోబోతుంది ఈ జంట. మరా పెళ్లి ఫొటోస్ అయినా వదులుతారా లేదంటే అనేది ఆమె అభిమానుల్లో ఆత్రుత కనబడేలా చేస్తుంది.