గేమ్ ఛేంజర్ ప్రేక్షకుల ముందుకు రావడానికి ఇంకా నెల రోజుల సమయమే ఉంది. అదే విషయాని మేకర్స్ గుర్తు చేస్తూ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ స్టైలిష్ పోస్టర్ నివదిలారు. 30 డేస్ టు గో అంటూ చరణ్ బైక్ పై రఫ్ఫాడించడానికి వస్తున్నాడా అనిపించేలాంటి పవర్ ఫుల్ పోస్టర్ గేమ్ ఛేంజర్ మేకర్స్ వదిలారు.
ఈ నెల 21 న గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం టీమ్ మొత్తం అమెరికా వెళుతుంది, అందుకు గల ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. భారీ అంచనాలతో తెలుగు, తమిళ, హిందీ ప్రేక్షకుల ముందుకు జనవరి 10 న గేమ్ ఛేంజర్ విడుదలకు రెడీ అవుతుంది. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్ అన్ని సినిమాపై విపరీతమైన అంచనాలు పెంచుతున్నాయి.
రామ్ చరణ్ పవర్ ఫుల్ లుక్, యాక్షన్, కియారా అద్వానీ అందం, శంకర్ మార్క్ మేకింగ్, సాంగ్స్ విజువల్స్, ఎస్ జె సూర్య విలనిజాన్ని గేమ్ ఛేంజర్ కి ప్రధాన ఆకర్షణ కాబోతున్నాయి. మరో 30 రోజుల్లో మెగా ఫ్యాన్స్ ఆరాటానికి గేమ్ ఛేంజర్ తెర వేయనుంది.