మెగా చిన్న కోడలుగా మారకముందు నుంచి హీరోయిన్ లావణ్య త్రిపాఠి డ్రెస్సింగ్ స్టయిల్ చాలా పద్దతిగా ఉండేది. ఆమె మోడ్రెన్ లుక్ కోసం ఏనాడూ ఆరాటపడలేదు. ఆమె గ్లామర్ చూపించినా ఎప్పుడు హద్దులు దాటలేదు. పెళ్ళయ్యాక కూడా అదే పద్దతిని పాటిస్తుంది. మెగా ఫ్యామిలోకి చిన్న కోడలుగా అడుగుపెట్టిన లావణ్య డ్రెసింగ్ స్టయిల్ మార్చేసింది.
కేవలం శారీస్, అలాగే చుడీదార్స్, వెకేషన్స్ లో ప్యాంటు షర్టు, ఇంకా లాంగ్ ఫ్రాక్స్ అంటూ డ్రెస్సులు విషయంలో చాలా చక్కగా మైంటైన్ చేస్తుంది. షాప్ ఓపెనింగ్స్ కి వెళ్లినా చీర కట్టులో అందంగా ముస్తాబవుతోంది. స్పెషల్ ఫోటో షూట్స్ లోను చుడీదార్స్ లో రాయల్ లుక్ లో కనువిందు చేస్తుంది.
తాజాగాను లావణ్య త్రిపాఠి మరోసారి బ్యూటిఫుల్ లుక్ తో మెస్మరైజ్ చేసింది. బేబీ పింక్ మోడ్రెన్ చుడిదార్ లో లావణ్య ఇచ్చిన రాయల్ ఫోజ్ కి ఆమె అభిమానులే కాదు మెగా ఫ్యాన్స్ కూడా వావ్ బ్యూటిఫుల్ అంటూ కామెంట్ చేస్తున్నారు.