బాలీవుడ్ క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా నితీష్ తివారి తెరకెక్కిస్తున్న రామాయణ పై ప్రస్తుతం భారీ అంచాలనున్నాయి. భారీ బడ్జెట్ తో భారీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రణబీర్ కపూర్ రాముడి పాత్రలో, సాయి పల్లవి సీత పాత్రలో కనిపిస్తుండగా.. కన్నడ స్టార్ హీరో యష్ రావణ్ గా కనిపిస్తున్నారు. రామాయణ రెండు భాగాలుగా విడుదల కాబోతుంది.
బాలీవుడ్ రామాయణ నుంచి ఇప్పటివరకు రిలీజ్ డేట్ అప్ డేట్ తప్ప ఆ చిత్రంపై అఫీషియల్ గా ఇంతవరకు ఎలాంటి అప్ డేట్ రాలేదు. రణబీర్ కపూర్ రామాయణ పై ఓ ఇంటర్వ్యూలో మట్లాడుతూ.. రామాయణ ప్రాజెక్ట్ లో వర్క్ చేస్తున్నందుకు చాలా హ్యాపీ గా ఉంది. ఇది ఎంతో గొప్ప కథ, రామాయణ గురించి చిన్నప్పటి నుంచి వింటూ పెరిగాను. నితీష్ తివారి దీనిని అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు.
ఈ ప్రాజెక్ట్ లో ఎంతో టాలెంటెడ్ యాక్టర్స్ నటిస్తున్నారు. ఇప్పటికే రామాయణ మొదటి భాగంలోని నా వంతు షూటింగ్ పూర్తి చేసేసాను, త్వరలోనే రామాయణ రెండో భాగం షూటింగ్ మొదలు కాబోతుంది. ఇలాంటి కేరెక్టర్ లో కనిపించాలనేది నా కల. రామాయణ తో ఆ కల తీరబోతుంది. భారతీయ సంసృతి గొప్పదనం ప్రపంచానికి చాటి చెప్పే చిత్రం రామాయణ అంటూ రణబీర్ కపూర్ రామాయణ పై ఇచ్చిన అప్ డేట్ వైరల్ గా మారింది.