Samyuktha latest glamour shootటాలీవుడ్ లో క్రేజీ హిట్స్ అందుకుని మెల్లగా బాలీవుడ్ లో జెండా పాతేందుకు రెడీ అయిన సంయుక్త సోషల్ మీడియాలో అంతగా యాక్టీవ్ గా ఉండదు. అప్పుడప్పుడు మాత్రమే తన ఫోటోషూట్స్ షేర్ చేస్తుంది. ఎప్పడు పద్దతికి మారు పేరుగా కనిపించే సంయుక్త ఆమె నటించిన సినిమాల్లోనూ ట్రెడిషనల్ కేరెక్టర్స్ లో మాత్రమే కనిపించింది.
గ్లామర్ కన్నా యాక్టింగ్ తోనే హైలెట్ అయ్యే సంయుక్త మీనన్ తాజాగా వదిలిన పిక్స్ చూస్తే సంయుక్త కు కూడా బాలీవుడ్ నీళ్లు వంటబట్టాయా అనిపించకమానదు. చీర కట్టు లోనే అందాలు చూపించేందుకు తెగ ట్రై చెయ్యడమే అందరికి షాకిచ్చింది.
లైట్ పింక్ అండ్ ఎల్లో కలర్ శారీతో దర్శనం ఇచ్చి అందాలు చూపిస్తూ అభిమానులకు చిన్నపాటి షాకిచ్చింది. సంయుక్త అందంగా కనిపించడంతో యూత్ సంయుక్త అందాలపై చర్చ పెట్టారు. ప్రస్తుతం సంయుక్త ఫొటోలు నెట్టింట సంచలనంగా మారాయి.