పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాజా సాబ్, హను రాఘవపూడి సినిమాల షూటింగ్స్ తో చాలా బిజీగా వున్నారు. ప్రభాస్ తో వర్క్ చేసే ఏ హీరోయిన్ అయినా ఆయన పంపించే ఫుడ్ పై, స్పెషల్ డిష్ లపై కామెంట్స్ చేయకుండా ఉండరు. గతంలో శ్రద్ద కపూర్, దీపికా, రీసెంట్ గా మాళవికా మోహనన్ అందారూ ప్రభాస్ ఫుడ్ తో చంపేస్తారంటూ కామెంట్స్ చేసినవారే.
సలార్ అప్పుడు తనకు తన ఫ్యామిలీకి ఒక రూమంత ఫుడ్ ప్రభాస్ పంపించాడు అంటూ పృథ్వీ రాజ్ సుకుమారన్ చేసిన కామెంట్స్ మర్చిపోకముందే తాజాగా జగ్గు భాయ్ అదేనండి జగపతి బాబు ప్రభాస్ తనకి పంపించిన ఫుడ్ ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చెయ్యడమే కాదు.. వివాహ భోజనంబు.. ఇది ప్రభాస్ ప్రమేయం లేకుండా జరిగింది.
ఎవరు చెప్పొద్దూ, చెబితే తాను పెట్టే ఫుడ్ తో ఈ బాబు బలి.. అదీ బాహుబలి లెవల్.. పందికొక్కులాగా తిని ఆంబొతులాగా పడుకుంటున్నాను అంటూ ప్రభాస్ తనకు ఎన్ని ఐటమ్స్ తో ఫుడ్ పంపించారో అనేది ఆ వీడియోలో షేర్ చేస్తూ జై భీమవరం అంటూ సోషల్ మీడియాలో ఆయన పెట్టిన వీడియో వైరల్ అయ్యింది.