తాజాగా డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జానీ మాస్టర్ ని డాన్సర్స్ అసోసియేషన్ నుండి శాశ్వతంగా తొలగించేశారు అనే వార్త సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ అయ్యింది. తాజాగా డ్యాన్స్ అసోసియేషన్ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఆదివారం రోజు డాన్స్ డైరెక్టర్స్ మరియు డాన్సర్స్ అసోసియేషన్ ఎలక్షన్స్ జరిగాయి. ఈ ఎలక్షన్స్ లో జోసెఫ్ ప్రకాష్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. దానితో పాటుగా జానీ మాస్టర్ ని డాన్సర్స్ అసోసియేషన్ నుండి శాశ్వతంగా తొలగించారని వార్త స్ప్రెడ్ అయ్యింది.
ఈ వార్తలపై జానీ మాస్టర్ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు.
నిర్ధారణవ్వని ఆరోపణలని కారణంగా చూపిస్తూ నన్ను శాశ్వతంగా యూనియన్ నుండి తొలగించినట్టు మీడియాలో పుకార్లు పుట్టిస్తున్నారు. అవేవీ నమ్మకండి!!
నా పదవీ కాలం ఇంకా ఉన్నా కూడా అనధికారికంగా, అనైతికంగా ఎలక్షన్లు నిర్వహించి వారికి వారే నిర్ణయాలు, హోదాలు తీసుకునే హక్కు ఎవరికీ లేదు. దీనికి కారణమైన వారిపై చట్టపరంగా వెళుతున్నాను.
టాలెంట్ ఉన్నవారికి పనివ్వకుండా, దొరక్కుండా ఎవ్వరూ ఆపలేరు. నా కొరియోగ్రఫీలో #GameChanger నుండి ఓ మంచి పాట రాబోతుంది, మీ అందరికీ కచ్చితంగా నచ్చుతుంది.