కాజల్ అగర్వాల్ కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో ఎన్టీఆర్ పై ఉన్న అభిమానంతో ఆయన నటించిన జనతా గ్యారేజ్ లో పక్కా లోకల్ సాంగ్ స్పెషల్ సాంగ్ లో ఎన్టీఆర్ తో స్టెప్స్ వేసింది. ఆ చిత్రం హిట్ అవడమేకాదు, ఆ చిత్రంలో కాజల్ చేసిన స్పెషల్ సాంగ్ ట్రెండ్ అయ్యింది. ఆ తర్వాత తమన్నా ఎన్టీఆర్ జై లవ కుశ లోను స్పెషల్ సాంగ్ చేసింది. స్వింగ్ జరా స్వింగ్ జరా సాంగ్ యూత్ ని ఊపేసింది.
ఇక పూజ హెగ్డే కూడా రామ్ చరణ్ రంగస్థలంలో అదిరిపోయే జిగేలు రాణిగా మెరుపులు మెరిపించింది. ఆ సాంగ్ సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్. మరి పుష్ప ద రైజ్ లో ఊ అంటావా మావా అంటూ సమంత వేసిన గ్లామర్ స్టెప్స్ యూత్ ని ఇప్పటికీ ఊపేస్తోంది. అలా టాప్ హీరోయిన్స్ అయ్యుండి వాళ్ళు స్పెషల్ సాంగ్స్ చేసి శెభాష్ అనిపించుకున్నారు.
కానీ ఇప్పుడు శ్రీలీల మాత్రం వాళ్ళ సరసన చేరలేకపోయింది అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పుష్ప ది రూల్ చిత్రం హిట్ అయ్యింది. అల్లు అర్జున్ సుకుమార్ అంతా హ్యాపీ. కాని అందులో కిస్సిక్ సాంగ్ చేసిన శ్రీలీల పై విమర్శలోచ్చాయి. శ్రీలీల డాన్స్ స్టెప్స్ బావున్నాయి. కానీ కిస్సిక్ సాంగ్ అనుకున్నట్టుగా వైరల్ అవ్వలేకపోవడం మైనస్ అయ్యింది. అది శ్రీలీల బ్యాడ్ లక్.
మరి ఇకపై ఇలాంటి సాంగ్స్ చెయ్యడానికి శ్రీలీల ఒప్పుకోదు అని ఆమె అభిమానులు చెబుతున్నారు. మరి శ్రీలీల ఏమనుకుంటుందో, ఆమె దగ్గరకొచ్చే ఐటెం ఆఫర్స్ ని ఎలా రిసీవ్ చేసుకుంటుందో చూడాలి.