Advertisementt

ప్రభాస్ ఫౌజీ పై క్రేజీ అప్డేట్

Mon 09th Dec 2024 02:01 PM
prabhas  ప్రభాస్ ఫౌజీ పై క్రేజీ అప్డేట్
Crazy update on Prabhas Fauji ప్రభాస్ ఫౌజీ పై క్రేజీ అప్డేట్
Advertisement
Ads by CJ

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సీతారామం దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న చిత్రం ఫౌజీ. అక్టోబర్ లోనే షూటింగ్ మొదలు పెట్టిన హను కి ప్రభాస్ అప్పుడప్పుడు అంటే రాజా సాబ్ షూటింగ్ తో పాటుగా సహకరిస్తున్నారు. కేరళలో మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఫౌజీ రెండో షెడ్యూల్ హైదరాబాద్ లోనే జరుపుకుంటుంది. హైదరాబాద్ లోనే జరుగుతున్న రాజా సాబ్ షూటింగ్ కి బ్రేక్ వస్తుంటే ప్రభాస్ ఫౌజీ సెట్స్ లోకి వెళుతున్నారు. 

తాజాగా ఫౌజీ నుంచి ఓ క్రేజీ అప్ డేట్ బయటికి వచ్చింది. హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో వేసిన ఓ భారీ సెట్ లో హను రాఘవపూడి ఫౌజీ చిత్రీకరణ చేపట్టారు. ఈ సెట్ లోనే ఫౌజీ లోకి కీలక సన్నివేశాలను పూర్తి చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ సెట్ లో జైలులో వచ్చే సన్నివేశాలను హను చిత్రీకరిస్తున్నట్లుగా తెలుస్తోంది. 

ఇప్పటివరకు హీరో లేని సన్నివేశాలను తెరకెక్కించిన హను రాఘవపూడి.. ప్రస్తుతం ప్రభాస్ తోనే కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ కి జోడిగా ఇమాన్వి నటిస్తుంది. 

Crazy update on Prabhas Fauji:

 Prabhas Fauji shooting update 

Tags:   PRABHAS
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ