Advertisementt

పుష్ప 2 కి మాజీ ఎమ్యెల్యే రోజా రివ్యూ

Mon 09th Dec 2024 12:09 PM
pushpa 2  పుష్ప 2 కి మాజీ ఎమ్యెల్యే రోజా రివ్యూ
Former MLA Roja on Pushpa 2 పుష్ప 2 కి మాజీ ఎమ్యెల్యే రోజా రివ్యూ
Advertisement
Ads by CJ

సుకుమార్-అల్లు అర్జున్ కాంబోలో ఈ నెల 5 న పాన్ ఇండియా మర్కెట్ లో విడుదలైన పుష్ప ద రూల్ చిత్రం అద్భుతమైన బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అభిమానులు, క్రిటిక్స్ పుష్ప 2 కి పాజిటివ్ రివ్యూస్ ఇచ్చారు. తాజాగా ఈ చిత్రాన్ని వీక్షించిన నగరి వైసీపీ మాజీ ఎమ్యెల్యే, వైసీపీ అధికార ప్రతినిధి రోజా పుష్ప ద రూల్ చిత్రాన్ని వీక్షించి తన స్పందనను సోషల్ మీడియాలో తెలియజేసారు.  

ఐకాన్ స్టార్... మీ #Pushpa2ThaRule నిజంగా అంచనాలు మించిన చిత్రం‌... #pushpa తో తగ్గేదేలే అన్నారు... #Pushpa2 తో అస్సలు తగ్గేదేలే అనిపించారు.. మా చిత్తూరు యాస వెండి తెరపై పలికిన తీరు హాల్ లో ఈలలు వేయిస్తోంది @alluarjun గారు మీ నటన అద్భుతం, యావత్ దేశాన్నే మీ మాస్ ఇమేజ్ తో పుష్పా అంటే ఫ్లవర్ కాదు ఫైర్..వైల్డ్ ఫైర్🔥 అని పూనకాలు పుట్టించారు, మా తిరుపతి గంగ జాతర సీన్ హైలైట్ శభాష్ బన్నీ అనిపించింది.. మీ శ్రమకి ఫలితమే మీ చిత్ర విజయం, మొత్తం యూనిట్ కి శుభాకాంక్షలు 💐

వేటూరి గారు ఒక ఇంటర్వ్యూ లో అంటాడు అచ్చమైన తెలుగు నుడికారం రాయలసీమ యాసలో ముఖ్యంగా చిత్తూరు, నెల్లూరు తెలుగులో దాగున్నాయి అని.

లెక్కల మాస్టారు #Sukumar గారు మా చిత్తూరు యాస గ్లోబల్ స్క్రీన్ పైన చిందులేయించారు, మీ @SukumarWritings తో, ఒక్క మాటలో చెప్పాలంటే సబ్జెక్ట్ ని ఛాలెంజ్ గా తీసుకుని ఒక్క భాష - యాస కే కాదు వేషానికి కూడ 100% న్యాయం చేయించారు నటీనటులతో. 

మా చిత్తూరు యాస లో చెప్పాలంటే ఊరు ఊరంతా... రేయ్ మచ్చా ఎవుడ్రా ఈడు అని మాట్లాడుకునేలా చేశారు. బాక్స్ఆఫీస్ బద్ధలు కొట్టి రికార్డులు తిరగరాస్తున్నాయి. తిరుపతి గంగజాతరను @ysrcp ప్రభుత్వం రాష్ట్ర పండుగగా చేసి అత్యంత వైభవంగా జరిపించింది. 

మీరు మూడు గంటల ఇరవై నిమిషాల సేపు ప్రేక్షకులకు ఊపిరాడనివ్వని ఒక సూపర్‌ పెర్ఫార్మెన్స్. హీరో చీర కట్టుకుని, పసుపు రాసుకుని, గంధం పూసుకుని, నిమ్మకాయల దండ మెడలో వేసుకుని, జాతరలో మాతంగి వేషంలో @alluarjun చెలరేగిపోయి డాన్స్ చేసిన సీన్లు స్క్రీన్ పై‌ అద్భుతంగా చేసి చూపించారు.. @iamRashmika సూపర్ 🫶 అంటూ తన సోషల్ మీడియా ఖాతాలో పుష్ప 2 రివ్యూ ఇచ్చారు. 

 

 

Former MLA Roja on Pushpa 2:

Former MLA Roja reviews Pushpa 2

Tags:   PUSHPA 2
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ