మహానటి కీర్తి సురేష్ పెద్దగా హడావిడి లేకుండానే పెళ్లి పీటలెక్కేందుకు రెడీ అయ్యింది. గత కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నిజం చేస్తూ కీర్తి సురేష్ తన చిన్నప్పటి ఫ్రెండ్ ఆంటోని ని పెళ్లి చేసుకోబోతున్నట్టుగా ప్రకటించింది. డిసెంబర్ 12 న గోవా లో కీర్తి సురేష్ ఆంటోని తో ఏడడుగులు నడవబోతుంది.
డిసెంబర్ 12 న గోవాలోని ఓ లగ్జరీ రిసార్ట్స్ లో కీర్తి సురేష్ వివాహం ఆంటోని తో హిందూ సాంప్రదాయం ప్రకారం జరుగుతుంది. ఈ పెళ్ళిలో ఆంటోని కీర్తి సురేష్ మెడలో తాళి కట్టి ఏడడుగులు నడవబోతున్నాడు. ఆ పెళ్లి ముగియగానే క్రిష్టియన్ సాంప్రదాయంలో కీర్తి సురేష్-ఆంటోనీల వివాహం జరగబోతుంది.
అది కూడా గోవాలోని హిస్టారికల్ చర్చ్ లో కీర్తి సురేష్-ఆంటోని లు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితుల నడుమ క్రిష్టియన్ సాంప్రదాయం ప్రకారం ఉంగరాలు మార్చుకుని ఒక్కటి కాబోతున్నారు.