అక్కినేని కోడలిగా నాగార్జున ఇంట అడుగుపెట్టిన శోభిత.. ఇప్పుడు దూళిపాళ్ల నుంచి అక్కినేని గా తన ఇంటి పేరు మార్చుకుంది. నాగ చైతన్య తో వివాహం తర్వాత శోభిత తన న్యూ లైఫ్ పై సోషల్ మీడియాలో చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. చైతన్య నా లైఫ్ లోకి రావడం అదృష్టంగా భావిస్తున్నాను, చైతు సింప్లిసిటీ, మంచి గుణాలు, అందరితో గౌరవంగా ఉండే విధానం తనను ఎంతో ఆకట్టుకున్నాయి, చైతూ నుంచి నేను నేర్చుకున్నది ప్రేమలో ఆత్మీయత ఎక్కువగా ఉండాలనేది.
పెళ్లి తర్వాత శ్రీశైలం వెళ్లి శివుడి దర్శనం నాకు ఎంతో ప్రశాంతతనిచ్చింది, చిన్నప్పటి నుంచే దైవ భక్తి తన జీవితంలో భాగమైందని తెలిపిన శోభిత టైమ్ దొరికినప్పుడల్లా కూచిపూడి, భరతనాట్యం ప్రాక్టీస్ చేయడం ఇష్టమని, పుస్తకాలు చదవడం, కవిత్వం రాయడం తనకు ప్రత్యేకమైన సంతోషాన్ని ఇస్తాయని తెలిపింది.
ఇక వంట విషయంలోనూ తనకు ప్రాక్టీస్ ఉంది.. అందులో ఆవకాయ, ముద్దపప్పు వంటి డిష్‌లు చెయ్యడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాను అంటూ శోభిత చెప్పుకొచ్చింది. అంతేకాదు కెరీర్ తొలినాళ్లలో తనకు అందం లేదు, ఆకర్షణగా లేవని చాలామంది తిరస్కరించారు, బ్యాక్రౌండ్ మోడల్ గా పనికి రావంటూ హేళన చేసేవారు.
కానీ పట్టుదలతో నన్ను రిజెక్ట్ చేసిన కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా మారడంలో చాలా సంతోషం అనిపించింది. ఈ మార్గంలో ఆత్మవిశ్వాసమే తన విజయానికి దోహదపడింది అంటూ శోభిత పేర్కొంది.