Advertisementt

మంచు మనోజ్ టెస్ట్ రిపోర్ట్స్ లో ఏముందంటే..

Sun 08th Dec 2024 10:10 PM
manchu manoj  మంచు మనోజ్ టెస్ట్ రిపోర్ట్స్ లో ఏముందంటే..
Manchu Manoj exits hospital మంచు మనోజ్ టెస్ట్ రిపోర్ట్స్ లో ఏముందంటే..
Advertisement
Ads by CJ

మంచు మనోజ్ పై మోహన్ బాబు అనుచరుడు వినయ్ దాడి కేసులో మంచు మనోజ్ ఈరోజు సాయంత్రం TX హాస్పిటల్‌ లో జాయిన్ అయిన విషయం తెలిసిందే. మంచు ఫ్యామిలీ ఆస్తి తగాదాల్లో మోహన్ బాబు vs మనోజ్ లలో మనోజ్ కి గాయాలవడమే కాదు, అతను ఆసుపత్రిలో చేరే వరకు వచ్చింది వ్యవహారం. 

కుంటుతూ.. మెడపై కట్టుతో ఆసుపత్రికి వచ్చిన మంచు మనోజ్ కి TX హాస్పిటల్‌ వైద్యులు అన్ని టెస్ట్ లు నిర్వహించారు, సిటీ స్కాన్ దగ్గర నుంచి అన్ని టెస్ట్ లు పూర్తి చేసిన మనోజ్ శరీరం పై అనుమానాస్పద దెబ్బలు గుర్తించడమే కాకుండా వైద్యులు పోలీసులకు సమాచారం అందించారు. కాలు, మెడ భాగంలో అంతర్గత గాయాలు అయ్యాయని వైద్యులు తెలిపారు.

అన్ని టెస్ట్ లు పూర్తవడంతో మంచు మనోజ్ బంజారాహిల్స్ TX హాస్పిటల్‌ నుండి డిశ్చార్జ్‌ అయ్యాడు. కంప్లైంట్ తీసుకున్న పోలీసులు మనోజ్‌ ఇంటికి వెళ్లి స్టేట్‌మెంట్‌ రికార్డ్‌ చేయనున్నారు. 

Manchu Manoj exits hospital :

Manchu Manoj exits hospital with neck brace amid alleged

Tags:   MANCHU MANOJ
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ