యాంకర్ అనసూయ నుంచి యాక్టర్ అనసూయ అనిపించుకున్న అనసూయ భరద్వాజ్ అందాలు గురించి ఎంత చెప్పినా తక్కువే. వరసగా పాన్ ఇండియా మూవీస్ తో అవకాశాలు దక్కించుకోవడమే కాదు తన పాత్రకు ప్రాధాన్యత ఉంటే ఏ సినిమాకైనా ఓకె చెప్పే అనసూయ తాజాగా పుష్ప 2 ద రూల్ తో విజయాన్ని సొంతం చేసుకున్నప్పటికీ అనసూయ రోల్ కు అంత ఇంపార్టెన్స్ లేకపోవడం, ఆమె పాత్రను తెల్చేయ్యడం పై అనసూయ ఫ్యాన్స్ డిజప్పాయింట్ అయ్యారు.
సినిమా షూటింగ్స్ తో ఎంత బిజీగా వున్నా అనసూయ సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటుంది. షాప్ ఓపెనింగ్స్ కి వెళ్లి రిబ్బన్ కటింగ్స్ తోనూ రెండు చేతులా సంపాదిస్తున్న అనసూయ ఈమధ్యన కాస్త బరువు పెరిగింది. 40 ప్లస్ లోను అదిరిపోయే అందాలతో మెరిసిపోయే అనసూయ తాజాగా వదిలిన ఫోటో షూట్స్ చూస్తే వావ్ బ్యూటిఫుల్ అనాల్సిందే.
పింక్ పట్టు చీరలో అనసూయ అద్భుతమైన సోయగానికి ఆడ లేడీస్ ఫిదా అవుతున్నారు. పింక్ కలర్ కంచి పట్టు చీరలో అనసూయ ఇచ్చిన చక్కటి ఫోజులు నిజంగా అద్భుతం అనాల్సిందే.