ఈరోజు ఆదివారం మంచు వారి ఇంట రచ్చ అంటూ మీడియాలో ఒకటే హడావిడి. మోహన్ బాబు తన అనుచరులతో కొడుకు మంచు మనోజ్ పై దాడి చేయించారంటూ మనోజ్ ఫిర్యాదు చెయ్యడం ఒక ఎత్తు అయితే మోహన్ బాబు గారే తన కొడుకు తనపై దాడికి సిద్దమయ్యాడంటూ కంప్లైంట్ చెయ్యడం మరో ఎత్తు. తన తండ్రి అనుచరుడు వినయ్ తో తనపై దాడి చేయించారంటూ మనోజ్ ఆరోపణలు హైలెట్ అయ్యాయి.
ఆస్తి విషయంలో స్కూల్ వ్యవహారంలోనే తనపై, తన భార్యపై దాడి చేసారంటూ మనోజ్ కంప్లైంట్ పెట్టడమే కాదు.. సాయంత్రానికి మంచు మనోజ్ నడవలేనిస్ స్థితిలో ఆసుపత్రిలో చేరడం ఈ వ్యవహారం మరింత హాట్ టాపిక్ గా మారింది. మంచు మనోజ్ కాలికి గాయంతో ఆసుపత్రికి వెళ్లడం వంటి పరిణామాలు వారింట్లో రచ్చ జరిగింది అని కన్ ఫర్మ్ అయ్యింది అంటూ నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు.
మంచు మనోజ్ నడవడానికి కూడా ఇబ్బంది పడుతూ పక్కవారి సపోర్ట్ తో ఆసుపత్రికి వెళుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక మనోజ్ కి వైద్య పరీక్షలు పూర్తి కాగా.. అతను మెడ భాగానికి గాయమైనట్లుగా వైద్యులు గుర్తించినట్లుగా తెలుస్తుంది. గత రెండు గంటలుగా జరిగిన టెస్ట్ లు పూర్తి కావడంతో మంచు మనోజ్ డిశ్ ఛార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళే అవకాశం ఉంది.