మంచు ఫ్యామిలిలో ఆస్తి గొడవలు, తండ్రీకొడుకులు ఒకరి మీద ఒకరు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసుకోవడం అనేది సోషల్ మీడియాలో ఒక్కసారిగా కలకలం సృష్టించింది. మోహన్ బాబు తనపై దాడి చేయించారంటూ మంచు మనోజ్ కంప్లైంట్ చెయ్యడం, కాదు మనోజ్ తనపై దాడికి తెగబడ్డాడు అంటూ మోహన్ బాబు మనోజ్ పై ఫిర్యాదు చెయ్యడం అనేది నిజంగా సంచలనం సృష్టించింది.
మరోపక్క మోహన్ బాబు అనుచరుడు వినయ్‌పై మంచు మనోజ్ ఫిర్యాదు చేసాడు, స్కూల్, ఆస్తుల విషయంలో మంచు మనోజ్ పై దాడి జరిగింది. విద్యానికేతన్ సంస్థలో కీలక పదవిలో ఉన్న వినయ్ మోహన్ బాబు చెబితేనే తనపై పై దాడి చేసాడు, నా తండ్రి మోహన్ బాబు తన అనుచరుల చేత దాడి చేయించారు.. ఖచ్చితంగా ఈ దాడి పై పోలీసులకు ఫిర్యాదు చేస్తాను.. అని మనోజ్ అన్నట్లుగా మీడియాలో వార్తలొస్తున్నాయి.
కానీ మంచు ఫ్యామిలీ మాత్రం ఆ వార్తల్లో నిజం లేదు, మోహన్ బాబు గారు మంచుమనోజ్ పరస్పర ఫిర్యాదులు చెసుకున్నారనే వార్తల్లో నిజం లేదు. మంచు మనోజ్ దెబ్బలతో వచ్చి మరీ పొలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తున్నట్లు ఊహాజనితమైన కధనాలను.. కొన్ని మీడియా చానెల్స్ ప్రసారం చేస్తున్నాయి.. ఎవిడెన్స్ లు లేకుండా అసత్య ప్రచారాలను చేయకండి.. అంటూ మంచు ఫ్యామిలీ ఈ వివాదం పై రియాక్ట్ అవుతుంది.