వైసీపీ కోసం ప్రాణం పెట్టి వైసీపీ సోషల్ మీడియా కోసం పని చేసిన వైసీపీ కార్యకర్తలను ఎవరూ అంటే వైసీపీ పెద్దలెవరూ పట్టించుకొవడం లేదు. అది శ్రీ రెడ్డి విషయంలోనే కాదు, పోసాని కృష్ణమురళి, బోరుగడ్డ అనిల్, నందిగం సురేష్ వ్యవహారంలోను జరుగుతుంది. వర్ర రవీంద్ర రెడ్డి, ఇంటూరి రవికిరణ్ లను మాత్రమే వైసీపీ తమ వాళ్ళుగా భావించింది తప్ప శ్రీరెడ్డి, అనిల్, నందిగం లను కాదు అనేది ఇప్పటికి కానీ వాళ్లకు అర్ధం కాలేదు.
RGV ని వెనకేసుకొచ్చి పోసానిని పక్కనపెట్టిన జగన్ వర్ర రవీంద్ర రెడ్డిపై జాలి చూపిస్తూ తమ కోసం ప్రతిపక్షంలో ఉన్న బాబు, లోకేష్, పవన్ లను చీరుస్తాను అంటూ రెచ్చిపోయిన బోరుగడ్డ అనిల్ ని వదిలెయ్యడం పై అనిల్ చిందులు తొక్కుతున్నాడు. గత రెండు నెలలుగా జైలులో ఉన్న బోరుగడ్డ తనని పట్టించుకోని వైసీపీ పెద్దలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు.
నిన్నటివరకు అయ్యో పాపమని నందిగం సురేష్ ని అన్న వైసీపీ నేతలెవరూ ఇప్పుడు నందిగం సురేష్ ని పట్టించుకోకపోవడం పై నందిగం సురేష్ కూడా ఫైరవుతున్నాడు. చంద్రబాబు ని తిట్టినందుకు సీటిచ్చిన జగన్.. ఆ తర్వాత సురేష్ వైసీపీ నేతల కోసం బాబు పై చెలరేగిపోయాడు, కానీ పదవి ఇచ్చినా నందిగం సురేష్ నిలబెట్టుకోలేదు, అతను అధికారం ముసుగులో బోలెడు వెనకేసుకున్నాడు కాబట్టే సురేష్ ని పెద్దలెవరూ పట్టించుకోవడం లేదు.. అనేది వైసీపీ వాదన.
అధికారంలో ఉన్నప్పుడు నందిగం సురేష్ సంపాదించేసాడంటూ సొంత నేతలే సురేష్ ని విమర్శించడం హాట్ టాపిక్ అయ్యింది. అంటే వైసీపీ కోసం ప్రాణం పెట్టి పని చేసిన ఎవ్వరిని వైసీపీ పట్టించుకోలేదు అనేది ఇవన్నీ చూస్తుంటే తెలుస్తుంది. ఇప్పటికైనా అర్ధం చేసుకుంటే బాగుపడతారంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.