మావాడే అల్లు అర్జున్ అంటూ వైసీపీ వాళ్ళు తమలో అల్లు అర్జున్ ని కలిపేసుకుని.. మావాడు పుష్ప 2 తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు అంటూ పబ్లిసిటీ చేసేసుకున్నారు. అందులో అంబటి రాంబాబు పుష్ప 2 ని బాగా ప్రమోట్ చేసాడు. అల్లు అర్జున్ మా వాడు అంటూ తమ పార్టీలో కలిపేసుకున్నాడు. మిగతా వైసీపీ నేతలు కూడా మెగా ఫ్యామిలీ కి-అల్లు అర్జున్ కి మద్యన డిస్టెన్స్ క్రియేట్ చెయ్యడానికి చాలా తిప్పలు పడ్డారు.
అల్లు అర్జున్ కి పవన్ కళ్యాణ్ కి ఉన్న గ్యాప్ ని వైసీపీ వాడుకోవాలని చూసింది, అల్లు అభిమానులకు - పవన్ అభిమానులకు మధ్యన గ్యాప్ క్రియేట్ చేసి లాభం పొందాలని ట్రై చేసింది. కానీ వైసీపీ కి అల్లు అర్జున్ ఇచ్చిన ఝలక్ చూస్తే ఇప్పడు వైసీపీ ఏమైపోతుందో అంటూ నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు.
అల్లు అర్జున్ పుష్ప ద రూల్ సక్సెస్ మీట్ లో భాగంగా అల్లు అర్జున్ ప్రేమగా టికెట్ రేట్లు పెంపు విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి కి థాంక్స్ చెబుతూనే ప్రత్యేకించి కళ్యాణ్ బాబాయ్ అంటూ పవన్ కి అల్లు అర్జున్ థాంక్స్ చెప్పడం చూసి వైసీపీ వాళ్ళు ఫుల్ గా డిజప్పాయింట్ అవుతున్నారు.
ఏంటి #bhAAi నిన్నేటి దాకా మేము నీకు వెన్ను దన్నుగా ఉంటే, ఇలా 🍽️ మార్చేశావ్ 😡....ఇలా @PawanKalyan బాబాయ్ అనేశావేంటి 😔 ఏంటో కళ్ళు ఉన్నాయని ఆనంద పడేలోపే, కన్నీళ్లు ఉన్నాయని గుర్తుచేస్తాడు ఆ దేవుడు 🥲 అంటూ నిరాశలోకి వెళ్లిపోతున్నారు వైసీపీ కార్యకర్తలు.
మరి కళ్యాణ్ బాబాయ్ అంటూ అల్లు అర్జున్ ఈజీగా థాంక్స్ చెప్పేసాడు. ఇప్పడు వైసీపీ వాళ్ళు అల్లు అర్జున్ ను మావాడు అంటారో, లేదంటే మనవాడు కాదు జనసేనవాడే అంటారో చూడాలి.