పుష్ప ద రూల్ నిజంగానే బాక్సాఫీసుని రూల్ చేసేస్తుంది. సుకుమార్ మాస్టర్ మైండ్ డైరెక్షన్, అల్లు అర్జున్ పెరఫార్మెన్స్ అన్ని పుష్ప 2 లోని లోపాలు కనిపించకుండా హైలెట్ అవడంతో పాన్ ఇండియా ఆడియన్స్ పుష్ప 2 కి బాగా కనెక్ట్ అయ్యారు. అందుకు ఉదాహరణ పుష్ప 2 కొల్లగొడుతున్న రికార్డ్ కలెక్షన్స్.
తెలుగులో ప్రీ రిలీజ్ ఈవెంట్ తోనే సరిపెట్టేసిన పుష్ప టీం సినిమా సూపర్ సక్సెస్ అవడంతో సక్సెస్ మీట్ పెట్టింది. నిన్న జరిగిన పుష్ప 2 సక్సెస్ మీట్ లో సుకుమార్ పుష్ప 2 విజయాన్ని ఎంజాయ్ చెయ్యలేకపోతున్నట్టుగా చెప్పారు. పుష్ప2 సినిమా రిలీజ్ అయ్యింది, హిట్ అయ్యింది, నేను మూడు సంవత్సరాలు సినిమా తీసినా.. ఆరు సంవత్సరాలు తీసినా.. ఒక ప్రాణాన్ని తీసుకురాలేను.
సినిమా విడుదలయ్యాక మూడు రోజులుగా నా మనస్సు ఏమి బాలేదు.. అంటూ సంధ్య థియేటర్ దగ్గర అల్లు అభిమాని చనిపోవడంపై సుకుమార్ స్పందిస్తూ తను పుష్ప 2 సక్సెస్ ని ఆస్వాదించలేకపోతున్నాను అంటూ ఆ సక్సెస్ మీట్ లో చెప్పకొచ్చారు.