Advertisementt

నాగ చైతన్యపై సాయి పల్లవి కంప్లైంట్

Sun 08th Dec 2024 09:49 AM
naga chaitanya  నాగ చైతన్యపై సాయి పల్లవి కంప్లైంట్
Sai Pallavi complaint against Naga Chaitanya నాగ చైతన్యపై సాయి పల్లవి కంప్లైంట్
Advertisement
Ads by CJ

సాయి పల్లవి తో యాక్టింగ్ చెయ్యాలన్నా లేదంటే ఆమెతో డాన్స్ స్టెప్స్ వేయాలన్నా నీరసమొచ్చేస్తుంది అంటూ తండేల్ హీరో, కొత్త పెళ్లి కొడుకు నాగ చైతన్య తన కజిన్ అమెజాన్ ప్రైమ్ కోసం చేస్తున్న రానా టాక్ షో లో కామెంట్స్ చెయ్యడం హాట్ టాపిక్ గా మారింది. లవ్ స్టోరీలోనే సాయి పల్లవితో డాన్స్ చెయ్యడం అంటే టెన్షన్ పడ్డాను అంటే.. సాయి పల్లవి మాత్రం లేదు చాలా ఈజ్ తో చక్కగా చేసారు అంది. 

కానీ నాగ చైతన్య మాత్రం నువ్వు ఒక్కదానివే నా డాన్స్ ను పోగుతున్నావ్ అంటూ నవ్వేసాడు. అయితే నాగ చైతన్య లో నీకు నచ్చనిది ఏమైనా ఉందా అని రానా సాయి పల్లవిని ఫోన్ లో అడిగితే.. కామ్ గా, కూల్ గా ఉంటాడు, ఏదైనా ఇబ్బంది అయినా బయటకి చెప్పడు అది కోపం తెప్పిస్తుంది చైతు విషయంలో అంటూ రానా కు సాయి పల్లవి కంప్లైంట్ చేసింది.

ఇక చైతూ మాత్రం నువ్వు నీ సినిమా(విరాటపర్వం)లో సాయి పల్లవి తో పాటలు లేకుండా, డాన్స్ లేకుండా ఎస్కెప్ అయ్యావ్ అంటూ ఆట పట్టించాడు, ఆ తరవాత సాయి పల్లవిని రానా లో నచ్చేది ఏమిటి అని అడిగితే దానికి సాయి పల్లవి రానా కూడా సింపుల్ గా కూల్ గా సరదాగా ఉంటాడు అనగానే రానా అయితే నీ ముందు నేను బాగానే యాక్ట్ చేశాను అంటూ నవ్వేసాడు. 

Sai Pallavi complaint against Naga Chaitanya:

Naga Chaitanya Gets Very tensed Working With Sai Pallavi

Tags:   NAGA CHAITANYA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ