బిగ్ బాస్ సీజన్ 8 లోకి టైటిల్ ఫెవరెట్ గా దిగిన యాంకర్ విష్ణు ప్రియా.. హౌస్ లో పృథ్వీ తో లవ్ ట్రాక్ సెట్ చేసుకుని ప్రేక్షకులకు కంటెంట్ ఇచ్చే ప్రాసెస్ లో తన ఆటను పక్కకు పెట్టేసింది. దానితో ఆమె ఆట మొత్తం పోయింది, పృథ్వీ వెనుక తిరుగుతూ ఆట ని వదిలేసింది. పృథ్వీ పై ఆమె చూపించిన కంటెంట్ ప్రేమ వర్కౌట్ అవ్వక తన అభిమానులే తనని అస్సహించుకునేలా చేసుకుంది.
ఇప్పుడు టాప్ 5 కి చేరువయ్యాక ఆ కల తీరకుండానే ఆమె బిగ్ బాస్ హౌస్ నుంచి ఈవారం డబుల్ ఎలిమినేషన్ లో భాగంగా రెండో ఎలిమినేటర్ గా నిలిచింది. ముందుగా శనివారం ఎపిసోడ్ లో రోహిణిని ఎలిమినేట్ చేసిన బిగ్ బాస్ ఆదివారం ఎపిసోడ్ లో విష్ణు ప్రియను ఎలిమినేట్ చేసినట్టుగా లీకులు బయటికొచ్చేసాయి.
విచిత్రంగా గత వారం డబుల్ ఎలిమినేషన్ లో విష్ణు ప్రియా ఇష్టపడిన పృథ్వీ ఎలిమినేట్ అవ్వగా, ఇప్పుడు విష్ణు ప్రియా ఈ వారం ఎలిమినేట్ అయ్యింది. అయితే విష్ణు ప్రియా మాత్రం పృథ్వీ నా వల్లే వెళ్లిపోయాడెమో అనేది రిగ్రెట్ అయినట్లుగా చెప్పడం విశేషం.