భారీ అంచనాలతో డిసెంబర్ 5 న పాన్ ఇండియా మార్కెట్ లోకి దిగిన పుష్ప రాజ్ అభిమానులకే కాదు ఫ్యామిలీ ఆడియన్స్ కు కూడా బాగా నచ్చేయ్యడంతో పుష్ప ద రూల్ రోజు రోజుకు కొత్త నెంబర్లు కాదు రికార్డ్ కొట్టే రేంజ్ లో కలెక్షన్స్ నమోదు చేస్తుంది. అల్లు అర్జున్ పుష్ప 2 తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడంతో అల్లు అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు.
అయితే తాజాగా ఏపీలో పుష్ప రాజ్ అభిమానులకు షాక్ తగిలింది. కుప్పంలో పుష్ప 2 ని ప్రదర్శిస్తున్న థియేటర్స్ ను సీజ్ చెయ్యడం హాట్ టాపిక్ గా మారింది. కుప్పంలో పుష్ప సినిమా ప్రదర్శిస్తున్న లక్ష్మి, మహాలక్ష్మి థియేటర్లను రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు.
ఆ రెండు థియేటర్స్ లైసెన్సు రెన్యూవల్ చేసుకోకుండా, NOC సర్టిఫికెట్ లేకుండానే పుష్ప 2 సినిమా ప్రదర్శనలు చేస్తున్నారంటూ అధికారులు నోటీసులిచ్చారు. ఇప్పుడు దానిని సీజ్ చెయ్యడంతో పుష్ప రాజ్ అభిమానులకు బిగ్ షాక్ తగిలింది.