బిగ్ బాస్ సీజన్ 8 ముగింపు దశకు చేరుకుంది. మరొక్క వారంలో బిగ్ బాస్ సీజన్ 8 గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కి తయారవుతుంది. ఇక ఈ చివరి వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో అనే విషయంలో బుల్లితెర ఆడియన్స్ లో క్యూరియాసిటీ మొదలైంది. సీజన్ 8 నుంచి చివరిగా ఎలిమినేట్ అయ్యేది ఎవరు, టాప్ 5 కి వెళ్ళేది ఎవరు అనే విషయంలో కాస్త సస్పెన్స్ నడుస్తుంది.
ఈరోజు శనివారం ఎపిసోడ్ లో కింగ్ నాగార్జున ప్రేరణ, నబీల్, నిఖిల్, గౌతమ్ లకు వారు చేసిన ఈవారం తప్పులను ఎత్తి చూపుతూ క్లాస్ పీకారు. అంతేకాకుండా ఈవారం డబుల్ ఎలిమినేషన్ అంటూ ట్విస్ట్ కూడా ఇవ్వడంతో ఈ వారం వెళ్ళబోయేది ఏ ఇద్దరూ అంటూ అప్పుడే అందరూ డిస్కర్షన్ స్టార్ట్ చేసేసారు.
తాజాగా ఈరోజు ఎపిసోడ్ లో తక్కువ ఓటింగ్ లో డేంజర్ జోన్ లో ఉండడంతో రోహిణిని ఎలిమినేట్ చేసినట్లుగా బిగ్ బాస్ లీకులు బయటికి వచ్చేసాయి. వైల్డ్ కార్డు ఎంట్రీతో హౌస్ లోకి వచ్చి కామెడీ చేస్తూనే టాస్క్ ల్లో ఇరగదీసిన రోహణి ఫైనల్ గా 14 వారంలో ఎలిమినేట్ అయ్యింది.