Advertisementt

BB8- హౌస్ మేట్స్ ను టెన్షన్ పెట్టిన నాగార్జున

Sat 07th Dec 2024 06:49 PM
nagarjuna  BB8- హౌస్ మేట్స్ ను టెన్షన్ పెట్టిన నాగార్జున
Nagarjuna who put tension on the housemates in BB8 BB8- హౌస్ మేట్స్ ను టెన్షన్ పెట్టిన నాగార్జున
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 8 లో లాస్ట్ వారానికి ఎంటర్ అవడానికి, గ్రాండ్ ఫినాలే వీక్ కు కేవలం రెండు రోజుల సమయమే ఉంది. ఈ వారమంతా ఓట్ అప్పీల్ కోసం హౌస్ మేట్స్ పోటీపడి టాస్క్ లు ఆడేసారు. అందులో ప్రేరణ, నబీల్, విష్ణు ప్రియా, నిఖిల్ లకు ఓట్ అప్పీల్చేసుకునే అవకాశం దక్కింది. ఇక శనివారం ఎపిసోడ్ లో నాగార్జున ఫ్రెష్ లుక్ తో సంతోషంగా కనిపించారు. నాగ చైతన్య వెడ్డింగ్ సెలెబ్రేషన్స్, పూజలు అవి ముగిసాక నాగ్ ఈ వారం హోస్ట్ గా వచ్చారు. 

ఇక రాగానే ఈ హౌస్ లో ఏ వారంలో తాము తప్పు చేశామని రిగ్రెట్ అయ్యారా అని అడిగారు. ప్రేరణ తాను 12 వారంలో చీఫ్ అయ్యాక కూల్ గా చేద్దామనుకున్నా కానీ అవ్వలేదు, ఆ వారం రిగ్రెట్ అయ్యాను అంది, మరి సంచలాక్ గా కరెక్ట్ గా చేసావా అంటూ నాగ్ క్లాస్ పీకారు. ఇక నబీల్ నువ్వు తాడు చుట్టే విధానం నేర్చుకో అంటూ విష్ణుతో శారీ చుట్టించడం, అలాగే టాస్క్ ఆడకుండా గేమ్ ఎలా గెలుస్తావంటూ నబీల్ ని అడిగిన నాగ్ 15 లక్షలు చెక్ మీద ఎలా రాసావ్, తర్వాత క్రష్ లో ఎందుకు వేసావ్ అంటూ క్లాస్ పీకారు.

ఇక రోహిణి అయితే నిఖిల్ దొరక్కుండా తప్పులు వెతుక్కుంటాడు అది నాకు నచ్చదు అంది, ఆతర్వాత నాగార్జున ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అంటూ హౌస్ మేట్స్ ని టెన్షన్ పెట్టేసారు. మరి ఈ వారం హౌస్ నుంచి ఇద్దరు అమ్మాయిలు డబుల్ ఎలిమినేషన్ లో అవుట్ అవుతారా లేదంటే అనేది తెలియాల్సి ఉంది.  

Nagarjuna who put tension on the housemates in BB8:

 BB8:Todaypromo goes viral

Tags:   NAGARJUNA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ