Advertisementt

నాగార్జున బెస్ట్ మామగారు

Sat 07th Dec 2024 05:03 PM
naga chaitanya  నాగార్జున బెస్ట్ మామగారు
Chaitu-Sobhita and Nagarjuna at Srisailam temple నాగార్జున బెస్ట్ మామగారు
Advertisement
Ads by CJ

నిజంగా కింగ్ నాగార్జున బెస్ట్ మామగారు అనే చెప్పాలి. అప్పుడు నాగ చైతన్య సమంతను ప్రేమించినప్పుడు నాగార్జున ఆ ప్రేమను ఒప్పుకుని వారి పెళ్లిని చాలా గ్రాండ్ గా చేసారు. అంతేకాదు సమంత తోనూ చాలా ప్రేమగా నడుచుకునేవారు. ఇప్పుడు కూడా నాగ చైతన్య శోభిత ను ప్రేమించి తండ్రి అంగీకారంతోనే పెళ్లి చేసుకున్నాడు. 

నాగార్జున కొడుకు చైతు పెళ్లిని దగ్గరుండి జరిపించారు. కోడలు శోభిత ను అలాగే ప్రేమగా ట్రీట్ చేస్తున్నారు. చైతూ శోభిత మెడ లో తాళి కట్టే సమయంలోను నాగ్ పక్కనే ఉండి కొడుకు-కోడల్ని ఆశీర్వదించారు. అలాగే నిన్న శ్రీశైలం వెళ్ళినప్పుడు కూడా కొత్త జంట పక్కనే నాగార్జున స్పెషల్ గా పూజలు నిర్వహించారు. 

అంతేకాదు శోభితతో నాగ్ ప్రేమగా ఉన్న క్షణాలను మీడియా క్యాప్చర్ చేసింది. శోభిత తన హెయిర్ సర్దుకుని దేవుడి కుంకుమ పెట్టుకుంటున్న సందర్భంలో ఆమే హెయిర్ ని నాగార్జున పక్కకు పెడుతూ కనిపించడం హైలెట్ అయ్యింది. అందుకే నెటిజెన్స్ నాగార్జున బెస్ట్ మామగారు అనాల్సిందే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

Chaitu-Sobhita and Nagarjuna at Srisailam temple:

Naga Chaitanya and Sobhita Dhulipala Visits Srisailam Temple

Tags:   NAGA CHAITANYA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ