ప్రియాంక అరుళ్ మోహన్, ఈ మధ్యన టోలీవుడ్ లో ఎక్కువగా వినబడుతున్న పేరు. శ్రీకారం, నాని గ్యాంగ్ లీడర్ తో పెరఫార్మెన్స్ పరంగా బావుంది అనిపించుకున్న ప్రియాంక మోహన్ సరిపోదా శనివారం చిత్రంలో మాత్రం కానిస్టేబుల్ గా మెప్పించింది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడం ఆమెకి బాగా కలిసొచ్చింది.
అందులోను పవన్ కళ్యాణ్ OG చిత్రంలో హీరోయిన్ కావడం ఆమె క్రేజ్ పెరగడానికి కారణమైంది. అప్పటినుంచి ఆమె ఫోటో సోషల్ మీడియాలో కనిపించగానే ఆమె ఫొటోస్ ని ట్రెండ్ చేస్తూ పవన్ ఫ్యాన్స్ ఎక్కువ హైప్ ఇస్తున్నారు. తాజాగా ప్రియాంక మోహన్ చీరకట్టు ఫొటోస్ షేర్ చేసింది.
ఆ చీరకట్టులో మెస్మరైజ్ చేసే బ్యూటీ తో ప్రియాంక మోహన్ కనిపించింది. ఫ్యాన్సీ టిష్యు శారీ లో ప్రియాంక మోహన్ అందాలు ఆరబొయ్యక్కర్లేదు, అణుకువ, అందం ఉంటే చాలు బ్యూటీ బయటికొస్తుంది అనడానికి ఉదాహరణగా కూల్ గా కనిపించి కనువిందు చేసింది.