నందమూరి వారసుడు మోక్షజ్ఞ డెబ్యూ చిత్రం ఈ నెల 5 వ తేదీన పూజా కార్యక్రమాలతో మొదలు కావాల్సి ఉండగా.. ఆ కార్యక్రమం పోస్ట్ పోన్ అయ్యింది. దానితో మోక్షజ్ఞ-ప్రశాంత్ వర్మ చిత్రం పై ఏవేవో ఊహాగానాలు మొదలయ్యాయి. ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞ డెబ్యూ డైరెక్టర్. ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ప్రశాంత్ వర్మ బిజీగా వున్నారు.
పూజా కార్యక్రమాలతో సినిమా మొదలైతే మోక్షజ్ఞ రెగ్యులర్ షూటింగ్ కి వెళతాడని నందమూరి అభిమానులు ఎగ్జైట్ అవుతున్న తరుణంలో ప్రశాంత్ వర్మ తో మోక్షజ్ఞ మూవీ ఆగిపోయింది అనే రూమర్స్ మొదలు కావడంతో నందమూరి అభిమానుల్లో ఆందోళన మొదలైంది.
అయితే తాజా సమాచారం ప్రకారం ప్రశాంత్ వర్మ-మోక్షు కలయికలో సినిమా ఆగిపోలేదట. కేవలం సినిమా ముహూర్తం వాయిదా పడినట్టుగా సమాచారం. సో ఈ క్రేజీ కాంబినేషన్ లో సినిమా ఇంకా ఆన్ లోనే ఉందని చెప్పాలి. మరి మక్షజ్ఞ డెబ్యూపై వస్తున్న వార్తలన్నీ జస్ట్ రూమర్స్ గానే మిగిలిపోవాలని నందమూరి అభిమానులు కోరుకుంటున్నారు.