నాగ చైతన్య-శోభిత ల వివాహం డిసెంబర్ 4 నైట్ 8 గంటల నుంచి రాత్రి 1గంట వరకు అన్నపూర్ణ స్టూడియోస్ లో అంగరంగ వైభవంగా ఫ్యామిలీ మెంబెర్స్, రిలేటివ్స్, సినీ ప్రముఖుల నడుమ జరిగిపోయింది. ఈపెళ్లి లో చైతు-శోభితలు చాలా సింపుల్ గా పెళ్లి కొడుకు-పెళ్లి కూతురుగా కనిపించారు. కానీ అది సింపుల్ కాదు చాలా గ్రాండ్ అంటూ చైతు పెళ్లి ఫొటోస్ ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి.
అందులో తన మేనమావ వెంకటేష్ నాగ చైతన్య ను పెళ్లి కొడుకుని చేస్తున్న ఫొటోస్, అలాగే దగ్గుబాటి ఫ్యామిలీ ఫొటోస్ వైరల్ గా మారాయి. నాగ చైతన్య అమ్మమ్మ, పెద్ద మేనమావ సురేష్ బాబు ఆయన వైఫ్, వెంకటేష్ ఆయన వైఫ్, చైతు తల్లి లక్ష్మి, ఆమె రెండో భర్త కలిసి ఉన్న దగ్గుబాటి ఫ్యామిలీ పిక్ వైరల్ అయ్యింది.
నాగ చైతన్య పెళ్ళిలో కజిన్స్ అంతా ఎంత సందడి చేసారో చూసాము, అలాగే ఇప్పుడు దగ్గుబాటి ఫ్యామిలీ మొత్తం తన మేనల్లుడు పెళ్ళిలో సందడి చేసారు, రానా అయితే చైతూ తో కలిసి పిక్స్ దిగుతూ సందడి చేసాడు.