తెలంగాణ తల్లి విగ్రహం అచ్చం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుమార్తె లాగా ఉందా..? రేవంత్ తయారు చేయించిన తెలంగాణ తల్లి విగ్రహం ఇదేనా..? కుమార్తె కోసం చేయించుకున్న విగ్రహమా? అంటే అవుననే అంటున్నారు తెలంగాణ వాదులు, మేధావులు, జర్నలిస్టులు. అసలు మునుపటి బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ చేసిన విగ్రహంకు.. కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి చేయించిన విగ్రహానికి తేడా ఏంటి..? జనాలు ఏమనుకుంటున్నారు..? ప్రతిపక్షాల ఆరోపణలు ఏంటి..? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం రండి.
ఏం జరుగుతోంది..?
పదేళ్లు తెలంగాణను ఏలిన గులాబి పార్టీ ఆనవాళ్లు చెరిపేయాలని రేవంత్ రెడ్డి చేయని భగీరథ ప్రయత్నాలు లేవన్నది తెలంగాణ చిహ్నం మార్పు, కాళేశ్వరంపై ఆరోపణలు వచ్చినప్పటి నుంచి వస్తున్న ప్రధాన ఆరోపణలు. ఈ క్రమంలోనే తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయడం, ఒకటి రెండు రోజుల్లో కాంగ్రెస్ అగ్ర నేతల ద్వారా ఓపెనింగ్ చేపించాలని రేవంత్ గట్టిగానే ప్లానింగ్ చేస్తున్నారు. ఐతే.. శుక్రవారం రోజు విగ్రహం ఫోటోను ప్రభుత్వం అధికారికంగా రిలీజ్ చేసింది. అప్పటి నుంచి అటు మీడియాలో ప్రతిపక్ష నేతలు.. ఇటు సోషల్ మీడియా వేదికగా తెలంగాణ వాదులు, మేధావులు, రాష్ట్రంలోని విద్యావంతులు, జర్నలిస్టులు చిత్ర విచిత్రాలుగా స్పందిస్తున్న పరిస్థితి. తెలంగాణ తల్లి విగ్రహమా..? రేవంత్ రెడ్డి కూతురు విగ్రహమా? అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోంది..? అంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.
జాగో.. జాగో..!
సీఎం రేవంత్ రెడ్డి.. ఇయ్యాల తెలంగాణ తల్లిని మార్చిండు.. రేపు అమరవీరుల స్థూపాన్ని మారుస్తడు..మనం సప్పుడు చెయ్యకుంటే
తెలంగాణ కూడా పేరు మారుస్తడు.. ఆ తరవాత తన గురువు చంద్రబాబుతోని కల్సి తెలంగాణను ఏపీలో కల్పుతడు.. జాగో తెలంగాణ జాగో అంటూ తెలంగాణ జర్నలిస్టులు కొంతమంది సోషల్ మీడియా వేదికగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఉద్యమ పిడికిలిని కాళ్ల కింద పెట్టడం ఉద్యమాన్ని కించపరచడమే అని.. అస్సలు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ తల్లి విగ్రహం ఉద్యమ తెలంగాణకు ఏమి సందేశం ఇస్తోంది? అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.
ఇవీ ప్రధాన ఆరోపణలు..
ఒకరు తల్లి, ఇంకొకరు పిల్లలా ఉంది. తల్లిని తయారుచేయబోయి పిల్లను తయారు చేశారు. బతుకమ్మను ఒక చేతిలో లేపేశారు. హస్తం గుర్తును హైలైట్ చేశారు. చీర కలర్ బ్లౌజుకు చేరింది. మూడు రంగుల జెండాను చూపెట్టారు. శుభంకు సూచనగా కుడి కాలు ముందుకు ఉండేది. ఇపుడు ఎడమ కాలు ముందుకు పెట్టారు. నగలు మాయం అయ్యాయి. దేవత, దేవసేన ఐనట్లు.. తల్లి, పిల్ల ఐనట్లు ఉందని ఇంకొందరు చదువుకున్న విద్యార్థులు ఒక రేంజిలో తిట్టిపోస్తున్న పరిస్థితి. ఈ ఆరోపణలపై కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి మరి.