పుష్ప ద రైజ్‌లో సమంత ఊ అంటావా మావా తో మాస్ ఆడియన్స్‌ని ఉర్రుతలూగిస్తూ దుమ్మురేపే స్టెప్స్‌తో, కళ్ళు మిరిమిట్లు గొలిపే అందాల జాతరలో అద్దరగొట్టేసింది. అప్పటినుంచి ఇప్పటివరకు సమంత ఊ అంటావా మావా సాంగ్ ట్రెండ్ అవుతూనే ఉంది. ఆ పాటలో ఆమె అందాలకు మించి ఆమె ఫేస్ ఎక్స్ప్రెషన్స్ హైలెట్‌గా నిలిచాయి.
ఇప్పడు పుష్ప ద రూల్ లో ఊ అంటావా మావా సాంగ్ కి మించేలా ఉండాలని మూవీ లవర్స్ కోరుకున్నారు, సుకుమార్ కూడా ఈ విషయంలో చాలా ఆలోచించారు. బాలీవుడ్ నుంచి హీరోయిన్ని దించే ప్లాన్ చేసినా లాస్ట్ మినిట్‌లో వర్కౌట్ అవ్వక ఆ స్పెషల్ సాంగ్ కోసం డాన్సింగ్ బ్యూటీ శ్రీలీలను తీసుకున్నారు. ఆమెతో కిస్సిక్ అంటూ మాస్ స్టెప్స్ వేయించారు.
ఆ పాట ప్రమోషన్స్ నిమిత్తం విడుదల చేసిన లిరికల్ వీడియో పర్లేదు అనిపించినా సినిమాలో మాత్రం శ్రీలీల డాన్స్, ఆ కిస్సిక్ సాంగ్ లిరిక్స్ అన్ని తెలిపోయాయి అంటూ మ్యూజిక్ లవర్స్ ఉసూరుమంటున్నారు. సమంత ఊ అంటావా ముందు కిస్సిక్ సాంగ్ దిగడుపే, శ్రీలీల కూడా అంతగా ఇంప్రెస్ చెయ్యలేకపోయింది, ఆ సాంగ్ చాలా డిజప్పాయింట్ చేసింది అంటూ మాట్లాడుకుంటున్నారు.
సమంత సీనియర్. ఆమె ఎక్స్ప్రెషన్స్ సాంగ్‌కి హైలెట్, కానీ శ్రీలీల అనుభవం కిస్సిక్ సాంగ్‌కి సరిపోలేదనే కామెంట్స్ కనిపిస్తున్నాయి.