అనుకున్నట్లుగానే పుష్ప రాజ్ బాక్సాఫీస్ వద్ద హిస్టరీ క్రియేట్ చేశాడు. ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ ఆల్ టైమ్ రికార్డ్‌ను నమోదు చేశాయి. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదలవడం, కోరుకున్నంతగా టిక్కెట్స్ ధరలను పెంచుకునే వెసులుబాటు లభించడంతో పాటు, ప్రీమియర్ అన్నీ ముందుగానే పడిపోవడంతో.. మొదటి రోజు ఈ సినిమా రూ. 294 కోట్ల కలెక్షన్లను రాబట్టినట్లుగా చెబుతూ మేకర్స్ అధికారికంగా పోస్టర్ విడుదల చేశారు.
ఈ పోస్టర్లో ఇండియన్ సినిమా హిస్టరీలోనే హయ్యస్ట్ డే 1 ఓపెనింగ్ కలెక్షన్స్ అంటూ ప్రకటించారు. మొదటి నుంచి ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. అలాగే సింగిల్ రిలీజ్ దొరకడం, రెండు వారాల పాటు బాక్సాఫీస్ వద్ద మరో స్టార్ హీరో సినిమా లేకపోవడం కూడా ఈ సినిమాకు బాగా కలిసొచ్చింది.
ఈ లెక్కన ఫస్ట్ డే నే కాదు, ఫస్ట్ వీక్ కూడా పుష్పరాజ్ సరికొత్త లెక్కలను బాక్సాఫీస్‌కు పరిచయం చేస్తాడని చెప్పడంలో ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. అలా కలిసొచ్చింది పుష్పకు. మౌత్ టాక్, రివ్యూస్ ఈ సినిమాకు మరింత బలాన్ని ఇవ్వడంతో.. పుష్పగాడి రూల్కి ఇక అడ్డే లేదు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు.