ఫహద్ ఫాసిల్- మరీ కామెడీ చేసేశారు
పుష్ప 2లో అల్లు అర్జున్‌తో సమానంగా ఉండాల్సిన కేరెక్టర్ ఏదైనా ఉందీ అంటే అది మళయాల హీరో ఫహద్ ఫాసిల్ భన్వర్ సింగ్ షెకావత్ దే. పార్ట్ 1 లో పార్టీ లేదా పుష్ప అంటూ అల్లు అర్జున్‌తో అగ్గిరగిలే మంట పెట్టుకుని పార్ట్ 1 ని ముగించిన సుకుమార్ పుష్ప పార్ట్ లో అల్లు అర్జున్ తో ఫహద్ ఫాసిల్ యాక్షన్ సీక్వెన్స్ పై ఫోకస్ పెడతారు అనుకున్నారు.
కట్ చేస్తే ఫహద్ ఫాసిల్ ని పుష్ప ద రూల్ లో కామెడీ విలన్‌ని చేసేశారు. మంగళం శీను, అనసూయ భరద్వాజ్ ఇలా ప్రతీ విలన్‌ని కామెడీ విలన్స్‌గా మార్చేసి.. కేవలం అల్లు అర్జున్ హీరోయిజంపై సుకుమార్ ఫోకస్ పెట్టారనిపించింది అంటూ ఫహద్ ఫాసిల్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. అందుకే ఫహద్ ఫాసిల్ పుష్ప ప్రమోషన్స్‌కు దూరంగా ఉన్నారంటూ కామెంట్స్ స్టార్ట్ చేశారు.
పుష్ప ద రైజ్ లో కొండారెడ్డి, జాల్ రెడ్డి, మంగళం శ్రీను లని దాటుకుని భన్వర్ సింగ్ షెకావత్‌తో తలపడిన అప్పటి పుష్ప కంటే ఇప్పటి పుష్ప ఇంకా పవర్ ఫుల్ అయినప్పటికీ దానికి ధీటైన విలనిజాన్ని చూపించకపోవడం విచిత్రమే.
ఫహద్ ఫాజిల్ తన ట్రెమండస్ యాక్టింగ్ తోను, టిపికల్ డైలాగ్ డెలివరీ తోను ఆకట్టుకున్నప్పటికీ తన పాత్రకు ఇచ్చిన ముగింపు సబబుగా అనిపించదు.. ఇది ఆయన అభిమానుల ఫీలింగ్.