రష్మిక ఇప్పుడు నేషనల్ కాదు ఇంటర్నేషనల్ క్రష్. పుష్ప 1 తో పాన్ ఇండియా హిట్ కొట్టి బాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా మారిన రష్మికా మందన్నా.. ఇప్పుడు పుష్ప ద రూల్ తో మరో బిగ్గెస్ట్ హిట్ అందుకుంది. అల్లు అర్జున్ పుష్ప రాజ్ పాత్ర కోసం ఎంతగా ప్రాణం పెట్టాడో.. రష్మిక శ్రీవల్లిగా అంతే సూపర్బ్ యాక్టింగ్‌తో ఆకట్టుకుంది.
పుష్పలో శ్రీవల్లి క్యారెక్టర్ పరంగా చాలా స్ట్రాంగ్‌గా కనిపించిన రష్మిక.. పీలింగ్స్ సాంగ్‌లో ఓ రేంజ్‌లో అందాలు ఆరబోసేసింది. అదే స్థాయిలో స్టెప్పులు అదరగొట్టేసింది. పార్ట్ 1 లో చాలా డీసెంట్‌గా పల్లెటూరి పడుచులా కనిపించిన రష్మిక.. పుష్ప పార్ట్ 2 లో మాత్రం ఎక్కువగా గ్లామర్ చూపించేందుకు ఇంట్రెస్ట్ చూపించిందా అనిపించింది. సుకుమార్ శ్రీవల్లి కేరెక్టర్‌ని హైలెట్ చేస్తూనే ఆమె అందాల పై ఫోకస్ పెట్టారు.
అల్లు అర్జున్ వీరంగం ఆడేస్తే.. క్లైమాక్స్‌లో మాత్రం రష్మిక ఫుల్ మార్కులు కొట్టేసింది. తన భర్తపై మాట పడనివ్వని శ్రీవల్లిగా రష్మిక చెప్పే సింగల్ షాట్ డైలాగ్ కి ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు. పుష్ప 2 రిజల్ట్‌తో రష్మిక మందన్న చించేసింది పో అంటూ కామెంట్స్ చేస్తూ ఆమె అభిమానులైతే ఫుల్ హ్యాపీగా ఉన్నారు.