రష్మిక మందన్న-విజయ్ దేవరకొండ వీరిద్దరూ ప్రేమికులే అనే అనుమానాలు ప్రతిసారి, ప్రతి సందర్భంలో కలిగేలా చేస్తున్నారు. రష్మిక, విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో చాలా సన్నిహితంగా ఉంటుంది. వాళ్లతో కలిసి ఫెస్టివల్స్ సెలెబ్రేట్ చేసుకుంటుంది. విజయ్ దేవరకొండ తో కలిసి వెకేషన్స్‌కు వెళుతుంది.
రీసెంట్‌గా నేనొక నటితో డేటింగ్‌లో ఉన్నాను అని విజయ్ దేవరకొండ, అటు రష్మిక చెన్నై పుష్ప ఈవెంట్ లోను మీకు తెలుసుగా అంటూ కాస్త కన్ఫ్యూజన్ గా ఆన్సర్ ఇవ్వడం అన్ని వీరు డేటింగ్‌లో ఉన్న విషయం చెప్పకనే చెప్పశారా అనే అనుమానాలు కలిగాయి. ఇప్పుడు రష్మిక మందన్న విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో కలిసి పుష్ప 2ని వీక్షించడం మరోసారి హాట్ టాపిక్ అయ్యింది.
హైదరాబాద్‌లోని మహేష్ బాబు AMB మాల్‌లో రష్మిక మందన్న విజయ్ దేవరకొండ తల్లి, తమ్ముడు ఆనంద్ దేవరకొండలో కలిసి పుష్ప ద రూల్ ని వీక్షించడం మరిన్ని అనుమానాలకు తావిచ్చింది. పుష్ప ద రూల్ సూపర్ సక్సెస్ అవడంతో ప్రస్తుతం రష్మిక చాలా హ్యాపీగా ఉంది. ఇదే మూడ్ లో ఆమె విజయ్‌తో ప్రేమలో ఉన్న విషయాన్ని బయట పెడితే బావుంటుంది అని ఆమె ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. చూద్దాం మరి.. ఆ వార్త ఎప్పటికి రివీల్ అవుతుందో..