పుష్ప విడుదలకు ముందు నుంచే అల్లు అర్జున్ ని మెగా ఫ్యామిలీ వెలివేసినట్టుగా క్రియేట్ చేస్తూ అల్లు అర్జున్ మావోడే.. మా వైసీపీ అభ్యర్థి శిల్ప రవిని సపోర్ట్ చెయ్యడానికి నంద్యాల వెళ్ళావ్, మా కోసం నిలబడ్డావ్ మరి నీ కోసం మేము నిలబడాలి గా, అస్సలు తగ్గేదే లే …✊🏻 నువ్వు మావాడివే అని వైసీపీ నేతలు అల్లు అర్జున్ కి మెగా ఫ్యామిలీకి చిచ్చు పెట్టాలని చాలా ట్రై చేసారు.
అంతేకాదు ఏపీలోని చాలా ఏరియాల్లో వైసీపీ అభిమానులు అల్లు అర్జున్ పుష్ప 2 బ్యానర్ పై జగన్ ఫోటో పెట్టి బైక్ ర్యాలీలు గట్రా చేస్తూ హంగామా చేస్తున్నారు.
మరోపక్క పుష్ప ద రూల్ చిత్రంలో ఉన్న చిన్న చిన్న డైలాగ్స్ ని సోషల్ మీడియాలో మెగా ఫ్యామిలీ, అలాగే మెగా అభిమానులు రెచ్చగొట్టేలా ఆ డైలాగ్స్ ని మరోలా మార్చి అతి చేస్తూ సోషల్ మీడియా లో వారు చేసిన పని చూసి చాలామంది చాలా రకాలుగా స్పందిస్తున్నారు. మీ బాస్‌కి నేనే బాస్ అన్న డైలాగ్‌ని ఎన్ని రకాలుగా మార్చి ప్రచారం చేసారో చెప్పక్కర్లేదు.
నీకు, నీ తండ్రికి, నీ బాబాయ్ కి నేనే బాస్ ని అంటూ అల్లు అర్జున్ పుష్పాలో డైలాగ్ చెప్పినట్లుగా స్ప్రెడ్ చేస్తున్నారు. అంతేకాకుండా అనంతపురం తీసుకుపోయి గుండుకొట్టిస్తాను, నా ఎర్ర చందనం బండిని సీజ్ చెయ్యమని చెప్పిన గుండు గాడికి చెప్పు ఇది పుష్ప గాడి బండి... పుష్ప గాడి రూలు... ఇంటర్నేషనల్ పర్మిట్ అని చెప్పు అంటూ వైరల్ చేస్తున్నారు.
ఇది నిజంగా వైసీపీ అతే అంటున్నారు కొందరు. పుష్ప రాజ్ గా అల్లు అర్జున్ సినిమా లోని డైలాగ్స్ పలికితే అది మెగా ఫ్యామిలీకి ఆపాదించి వారి మధ్యలో గొడవలు పెట్టేసి ఆనందిద్దామనుకున్నారు. కానీ అల్లు ఫ్యాన్స్ వైసీపీ అతి ని పసిగట్టి రివర్స్ ఎటాక్ చెయ్యడం వైసీపీకి షాకిచ్చింది.