నందమూరి వారసుడు మోక్షజ్ఞ హీరోగా తెరంగేట్రానికి తెర వెనుకే కాదు, తెర ముందు కూడా ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. ప్రశాంత్ వర్మ దర్శకుడిగా మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అనౌన్సమెంట్ కూడా వచ్చేసింది. ఈరోజు డిసెంబర్ 5 న మోక్షజ్ఞ మొదటి సినిమా పూజా కార్యక్రమాలు జరిపేందుకు భారీ ఏర్పాట్లు చేశారన్నారు.
నందమూరి అభిమానులు ఎంతో సర్ ప్రైజ్ ఫీలయ్యారు. కట్ చేస్తే మోక్షజ్ఞ డెబ్యూ మూవీ పూజా కార్యక్రమాలు వాయిదా వేస్తున్నట్టుగా ప్రెస్ నోట్ వదిలారు మేకర్స్. దానితో మోక్షజ్ఞ, నందమూరి అభిమానులు చాలా డిజప్పాయింట్ అయ్యారు. మోక్షజ్ఞ తన డెబ్యూ మూవీ కోసం పూర్తి మేకోవర్ లోకి మారాడు.
ఎన్నాళ్ళుగానో నందమూరి అభిమానులు వేచి ఉన్న తరుణం ఈరోజు మోక్షజ్ఞ సినిమా పూజా కార్యక్రమాలతో మొదలవుతుంది అనుకుంటే అది అన్ ఎక్స్ పెక్టెడ్ గా వాయిదాపడింది. అయితే అసలు విషయం తెలియకపోయినా.. మోక్షజ్ఞ ఇంకాస్త సమయం కావాలని కోరడంతోనే అతని మొదటి సినిమా పూజా కార్యక్రమాలు ఆగాయంటూ గుసగుసలు మొదలయ్యాయి.
మరోపక్క మోక్షజ్ఞ-ప్రశాంత్ వర్మ మూవీ క్యాన్సిల్ అనే న్యూస్ వైరల్ అవ్వడంతో నందమూరి అభిమానులలో ఆందోళన మొదలైంది.