నిన్న బుధవారం రాత్రి సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందడం, అలాగే మరో ఇద్దరు ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడిన ఘటన సంచలనం సృష్టించింది, అల్లు అర్జున్ సంధ్య థియేటర్ కి వస్తున్నారని తెలిసి ఆయన అభిమానులు అక్కడికి లెక్కకు మించి చేరుకోవడం, థియేటర్ సిబ్బంది ఒక్కసారిగా గేట్లు ఓపెన్ చెయ్యడంతో అక్కడ తొక్కిసలాటలో ఓ మహిళా ప్రాణాలు కోల్పోవడం అందరిని కలిచివేసింది.
ఈ ఘటన పై చిక్కడపల్లి పోలీసుల కేసు నమోదు చేసారు. సెక్షన్ 105,118 BNS యాక్ట్ ప్రకారం సంధ్య థియేటర్ యాజమాన్యంపై కేసు నమోదు చేసారు. అల్లు అర్జున్ థియేటర్ కు వస్తున్న సందర్భం లో భద్రత విషయంలో నిర్లక్ష్యం వహించిన సంధ్య థియేటర్ యాజమాన్యం పై అలాగే అల్లు అర్జున్ వస్తున్న విషయం పోలీసులకు సరైన సమయంలో చెప్పకుండా బాధ్యతరాహిత్యంగా వ్యవహరించిన అల్లు అర్జున్ టీం పై కూడా పోలీసులు కేసు నమోదు చెయ్యడం ఇప్పుడు సెన్సేషన్ అయ్యింది.