వైసీపీ హయాంలో అంతా జ..గన్ పాలనగా నడిచిందని అధికారం పోతేగానీ తెలియలేదు. తుపాకులతో బెదిరించి కాకినాడ పోర్టు, సెజ్‌లోని రూ.3,600 కోట్ల విలువైన వాటాను కారుచౌకగా కొట్టేయడానికి వైఎస్ జగన్ కుట్ర పన్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు నాడే వచ్చాయి. దీనికి కర్త, కర్మ, క్రియ అంతా ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్‌రెడ్డి అని బాధితుడి ఫిర్యాదుతో తేలిపోయింది. వాటాలు ఇస్తే సరే లేకుంటే లేకుంటే అక్రమ కేసులు, అరెస్టులు ఉంటాయని బెదిరించి.. ఆఖరికి వ్యాపారాలు కూడా మూసేయిస్తానని బెదిరించడం గమనార్హం. ఇలా కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్‌లోని రూ.2,500 కోట్ల విలువైన వాటాలను రూ.494 కోట్లకు, కాకినాడ సెజ్‌లోని రూ.1,109 కోట్ల విలువైన వాటాలను రూ.12 కోట్లకు బలవంతంగా అరబిందో సంస్థకు బదలాయించుకున్నారు. ఈ విషయాన్ని బాధితుడు కర్నాటి వెంకటేశ్వరరావు సీఐడీకి ఫిర్యాదు చేయడంతో వెలుగుచూసింది. విక్రాంత్‌రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి, అరబిందో సంస్థ ప్రతినిధి పి.శరత్‌చంద్రారెడ్డి, పీకేఎఫ్ శ్రీధర్ అండ్ సంతానం ఎల్‌ఎల్‌పీ ఆడిట్ సంస్థలు, అరబిందో రియాల్టీ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్, దాని డైరెక్టర్లు, ఇతరులను ఈ కేసులో నిందితులుగా సీఐడీ చేర్చింది. కేసు నమోదు చేసుకున్న సీఐడీ లోతుగా దర్యాప్తు చేస్తోంది.
నేనెప్పుడూ చూడలేదు!
ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు కూడా సీరియస్‌గా తీసుకున్నారు. ఇలాంటి పరిస్థితిని తాను ఎప్పుడూ, ఎక్కడా చూడలేదని, అస్సలు దేశంలోనే లేదని చెప్పుకొచ్చారు. ముంబైలో గ్యాంగ్‌స్టర్లు ఇలా చేస్తే ఆస్తులను తిరిగి తీసుకునే చట్టం ఉందని తెలిసిందని.. ఆ సమాచారం తెచ్చుకుని కర్నాటి వెంకటేశ్వరరావుకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. వైసీపీ హయాంలో జరిగిన ప్రతి ఒక్క విషయంపైనా విచారణ జరిపి బాధితులకు న్యాయం చేస్తానని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వేదికగా నిర్వహించిన ప్రజా వేదిక నుంచి భరోసా ఇచ్చారు. ఇదంతా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టు టూర్ తర్వాత ఒక్కొ్క్కటిగా వైసీపీ అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. అటు పవన్, ఇటు చంద్రబాబు కూడా ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. అయితే కేవీ రావు గురించి నాడు 2019 ఎన్నికల్లోనే అంతా చంద్రబాబు మనిషే అన్నట్లుగా వ్యాఖ్యానించడం గమనార్హం. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైసీపీ కార్యకర్తలు తెగ వైరల్ చేస్తున్నారు.
లుకౌట్ నోటీసులు
సీఐడీ కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఎంపీ విజయసాయిరెడ్డికి పోలీసులు లుకౌట్ నోటీసులు జారీచేయడం జరిగింది. ఈయనతో పాటు విక్రాంత్ రెడ్డి, అరబిందో అధినేత శరత్ చంద్రారెడ్డి మరికొందరు నేతలకు కూడా లుకౌట్ నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ కేసు విచారణ పూర్తయ్యేదాకా ఈ ముగ్గురు దేశం విడిచి వెళ్లరాదు. ఏమున్నా సరే కోర్టుల అనుమతితోనే చేయాల్సి ఉంటుంది. అసలే 108 అంబులెన్స్ వ్యవహారంలో అరబిందోపై లేనిపోని ఆరోపణలు, విచారణకు ఆదేశించే పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలో ఒక్కొక్కటిగా అరబిందో లీలలు, అరబిందో సమేత నేతల బాగోతాలు ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. మొత్తానికి చూస్తే వైసీపీలో అగ్రనేత, నంబర్ 2గా పిలిపించుకునే సాయిరెడ్డికి నిండా మునిగినట్టేనని, ఆయన మెడుకు ఉచ్చు బిగిసినట్లేనని రాజకీయ విశ్లేషకులు, న్యాయ నిపుణులు చెబుతన్నారు. ఏం జరుగుతుందో చూడాలి మరి.