నాగ చైతన్య-శోభితల వివాహం గత రాత్రి హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లో అంగరంగ వైభవంగా జరిగింది. దాదాపు ఎనిమిదిగంటల పాటు చైతు-శోభితల వివాహాన్ని సాంప్రదాయంగా జరిపించారు శోభిత ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీస్. ఈ పెళ్ళికి మెగాస్టార్ చిరు దగ్గర నుంచి జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఇంకా దగ్గుబాటి ఫ్యామిలీ మొత్తం హాజరైంది.
అయితే నాగార్జున నూతన వధూవరుల ఫొటోస్ ని షేర్ చేసారు. కేవలం ఆ నాలుగు ఫొటోస్ మాత్రమే సోషల్ మీడియాలో కనిపించాయి తప్ప.. చైతు-శోభిత ల మిగతా ఫొటోస్ కానీ, ఫ్యామిలీ పిక్ కానీ, గెస్ట్ ల ఫొటోస్ కానీ బయటికి రాలేదు. తాజాగా నాగ చైతన్య-శోభితల తలంబ్రాల బట్టల్లో ఉన్న పిక్ అలాగే కజిన్స్ తో దిగిన పిక్స్ వైరల్ అయ్యాయి.
ANR విగ్రహం దగ్గర అక్కినేని ఫ్యామిలీ, దగ్గుబాటి ఫ్యామిలీ దిగిన పిక్, చైతు కజిన్స్ తో కొత్త జంట దిగిన పిక్, నాగ చైతన్య-శోభితల తలంబ్రాల బట్టల్లో ఉన్న అన్ సీన్ పిక్స్ బయటికొచ్చాయి.