బిగ్ బాస్ సీజన్ 8 ఆట ఆల్మోస్ట్ ముగింపు దశకు వచ్చేసింది. అయినప్పటికి హౌస్ మేట్స్ ఇంకా ఇంకా గొడవలు పడుతూనే ఉన్నారు. మరో రెండు వారాల్లో బిగ్ బాస్ 8 గ్రాండ్ ఫినాలే కి రెడీ అయ్యింది. ఇంకా హౌస్ మేట్స్ మధ్యలో సఖ్యత కనిపించడం లేదు, నామినేషన్స్ విషయంలో గౌతమ్, నిఖిల్ రెచ్చిపోయి గొడవ పడ్డారు,
నువ్వు యష్మిని వాడుకున్నావ్ అంటే నువ్వు ప్రేరణను ఆడుకున్నావ్ అంటూ రచ్చ రచ్చ చేసారు, గౌతమ్ మూసుకోమంటే మాట జారితే ఊరుకోను అంటూ నిఖిల్ వార్నింగ్ ఇచ్చాడు.తర్వాత అవినాష్ కి నబీల్ కి తేజ విషయంలో పెద్ద గొడవే జరిగింది. అవినాష్ టాప్ 5కి వచ్చేసాను ఇంకేమిటి అనుకుని గొడవ పెట్టుకున్నట్టుగా కనిపించింది.
ఈ వారం ఓట్ అప్పీల్ కోసం కంటెస్టెంట్స్ టాస్క్ లలో పోటీపడుతున్నారు. టాస్క్ లు గెలిచి ముందుగా ప్రేరణ ఓట్ అప్పీల్ చేసుకుంటే తర్వాత నబీల్ ఓట్ అప్పీల్ చేసుకున్నాడు. ఇక ఈ వారం అవినాష్ తప్ప మిగతా వారంతా నామినేషన్స్ లో ఉన్నారు. గౌతమ్, నిఖిల్, ప్రేరణ, రోహిణి, నబీల్, విష్ణు ప్రియా మొత్తం నామినేషన్స్ లోకి రాగా గౌతమ్ ఓటింగ్ పరంగా టాప్ లో ఉన్నాడు.
రెండో స్థానంలో నిఖిల్ ఉండగా ప్రేరణ మూడో స్థానంలో టాప్ 5 ని కన్ ఫర్మ్ చేసుకుంది. ఇక నాలుగో స్థానంలో రోహిణి, ఐదో స్థానంలో విష్ణు ప్రియా, డేంజర్ జోన్ లీస్ట్ ప్లేస్ లో నబీల్ ఉన్నాడు. నిఖిల్ తర్వాత టైటిల్ ఫెవరేట్ గా ఉన్న నబీల్ డేంజర్ జోన్ లో ఉండడం ఆయన అభిమానులకు షాకిచ్చింది. మరి ఈవారం ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి.