చెప్పను బ్రదర్ అంటూ పవన్ ఫ్యాన్స్ ను కెలికిన అల్లు అర్జున్ ఇప్పుడు మెగా ఫ్యాన్స్ హర్ట్ అయ్యేలా చేశాడంటూ అల్లు అర్జున్ పై మెగా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. పుష్ప2 చిత్రంలో మెగాస్టార్ ని ఇండైరెక్ట్ గా టార్గెట్ చేసాడు అంటూ మెగా అభిమానులు పుష్ప ద రూల్ ని బాయ్ కాట్ చేస్తూ వేస్తున్న ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి.
ఓ మెగా అభిమాని ఆవేదన.. ట్వీట్ రూపంలో..
చిరంజీవిని అభిమానించే మెగా అభిమానులు ఎవరు కూడా పుష్ప2 సినిమా థియేటర్లలో చూడవద్ధు, అల్లు అర్జున్ మంచి నటుడు అందులో డౌట్ లేదు, కాని స్టేజ్ మీద మెగా ఫ్యామిలీ గురించి చేసే ఇండైరెక్ట్ కామెంట్స్ చాలా భాధ అనిపిస్తున్నాయి, కేవలం మెగా ఫ్యామిలీ హీరో అని అతని మొహం ఎలా ఉన్నా చూసాం, తరవాత తన నటనతో మంచి పేరు తెచ్చుకున్నాడు.
రాను రాను చిరంజీవి ఫ్యామిలీ ని దూరం పెట్టాలి అని ఎలక్షన్ టైంలో పిలవని పేరంటానికి నంద్యాల వెళ్లి అభిమానులు అందరికి దూరం అయ్యాడు, చిరంజీవి, పవన్, మిగతా హీరోలు ఎవరు కాని ఇతనిని ఇప్పటి వరకు ఏమి అనలేదు. ఏదో అభిమానులు సోషల్ మీడియా లో కామెంట్స్ చేసుకోవడం తప్ప.
ఇండస్ట్రీలో ఒక పెద్ద హీరో గా నిలదొక్కుకోవడానికి మెగా ఫ్యామిలీ ఎంతో సపోర్ట్ గా ఉంటే ఇప్పుడు నీ పిల్ల చేష్టలతో వాళ్ళ మనోభావాలను దెబ్బతీసావ్, సందట్లో సడేమియా లాగా *శవాల* పార్టీ నాయకులు రంగంలో కి దిగి ఫ్లెక్సీ ల మీద కామెంట్స్.. తల్లి, చెల్లి మీద కేసులు పెట్టేవాళ్ళు, సొంత కుటుంబ సభ్యులను చంపేవాళ్ళు కాదులే మా వాళ్ళు, ఇక నుండి మేము శ్రీరెడ్జీ, బోరుగడ్జ అనీల్, RGV, బూతుల నానీ లాంటి వాళ్ళని ఎలా చూస్తామో నిన్ను కూడా అంతే ....
నీ హీరోయిజం మాకొద్దు మాకు మెగా ఫ్యామిలీ తో పాటు ప్రభాస్, మహేష్, బాలక్రిష్ణ ఉన్నారు, పుష్ప సినిమా నిజంగా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం ఎందుకంటే మా మెగా ఫ్యామిలీ అందరికి మంచి జరగాలని కోరుకుంటుంది కాబట్టి, సినిమా రంగం గత ఐదు సంవత్సరాలు అస్తవ్యస్తం చేసి పవన్ సినిమాలకి టికెట్ 5 రూపాయలు చేసిన పార్టీ కి నువ్వు సపోర్ట్ చేస్తే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ నీ సినిమా కి భారీగా టికెట్ల రేటు పెంచారు అది వాళ్ళ ఔన్నత్యం అర్థం అయింది గా అల్లు అర్జున్ అంటూ ఓ మెగాభిమాని వేసిన ట్వీట్ వైరల్ అయ్యింది.