ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు చివరి షెడ్యూల్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. అటు పాలిటిక్స్, ఇటు సినిమా షూటింగ్స్ తో పవన్ కళ్యాణ్ ఎప్పటిలాగే ఫుల్ బిజీ బిజీ. అయినప్పటికీ తాను ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేసేయాలని చూస్తున్నారు. వీరమల్లు షూటింగ్ ఓ కొలిక్కి రాగానే పవన్ కళ్యాణ్ మరో మూవీ OG సెట్స్ లోకి వెళతారు.
ఈ నెల 6 నుంచి OG కొత్త షెడ్యూల్ మొదలు పెట్టేందుకు దర్శకుడు సుజిత్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ నెల 6 నుంచి 20 వరకు సుజిత్ బ్యాంకాక్ షెడ్యూల్ కోసం రెడీ అవుతున్నారు. అయితే యదా తదంగా అంటే కొన్ని నెలలుగా హీరో లేని సన్నివేశాలను తెరకెక్కించిన సుజిత్ మళ్ళీ బ్యాంకాక్ షెడ్యూల్ లోను పవన్ కళ్యాణ్ లేని సన్నివేశాల చిత్రీకరణ జరపనున్నారని తెలుస్తోంది.
అయితే పవన్ ఎప్పుడు OG సెట్స్ లోకి వెళతారో అనేది తెలియాల్సి ఉంది. పవన్ ఒన్స్ OG సెట్ లోకి ఎంటర్ అయితే OG రిలీజ్ డేట్ లాకవుతుంది.