Advertisementt

పుష్ప ద రూల్ ఫస్ట్ హాఫ్ రిపోర్ట్

Wed 04th Dec 2024 11:46 PM
pushpa 2  పుష్ప ద రూల్ ఫస్ట్ హాఫ్ రిపోర్ట్
Pushpa the rule first half report పుష్ప ద రూల్ ఫస్ట్ హాఫ్ రిపోర్ట్
Advertisement
Ads by CJ

అల్లు అర్జున్-సుకుమార్ కాంబో వైల్డ్ ఫైర్ సిద్దమైంది. ఈరోజు నైట్ 9 నుంచే పుష్ప ద రూల్ మోత ఇండియా మొత్తం మోగిపోతుంది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ పుష్ప థియేటర్స్ దగ్గర రచ్చ మొదలెట్టేసాడు. ఇక 9.30 నిమిషాలకు ప్రీమియర్స్ మొదలైన పుష్ప ద రూల్ ఫస్ట్ హాఫ్ ఇప్పుడే పూర్తయ్యింది. 

మరి సినిమా ప్రేమికులు ఊరుకుంటారా.. సోషల్ మీడియాలో పుష్ప ఫస్ట్ హాఫ్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నారు. రాజమౌళి పుష్ప ద రూల్ ఇంట్రో సీన్ కి ఇచ్చిన హై లేకపోయినా జపాన్ లో మొదలైన ఇంట్రడక్షన్ సీన్ ఆకట్టుకుంది. 

అయితే ఫ్లాష్ బ్యాక్ స్టోరీ మొదలయ్యాక రష్మిక-అల్లు అర్జున్ నడుమ వచ్చిన పీలింగ్స్ సాంగ్ లేకపోతే ఇంకాస్త నిడివి తగ్గేది, అదొక్కటే ఫస్ట్ హాఫ్ కి మైనస్ అంటూ ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఫస్ట్ హాఫ్ అంతా డీసెంట్ గా వెళుతుండగా.. ఇంటర్వెల్ బ్లాక్ కి ఇచ్చిన హై రేంజ్ సీక్వెన్స్ సెకండ్ హాఫ్ పై మరింత ఇంట్రెస్ట్ పెంచేసింది. 

సుకుమార్ టేకింగ్, అల్లు అర్జున్ పెరఫార్మెన్స్, ఫహద్ ఫాసిల్ పెరఫార్మెన్స్ అన్ని ఫస్ట్ హాఫ్ లో అదిరిపోగా.. సెకండ్ హాఫ్ లో మొదలయ్యే యాక్షన్ కోసం వెయిటింగ్ అంటూ అభిమానులు ట్వీట్లు పెడుతున్నారు. ఫస్ట్ బ్లాక్ బస్టర్ అంటూ అల్లు ఫ్యాన్స్ మరింతగా ఎగ్జైట్ అవుతూ ట్వీట్లు వేస్తున్నారు. 

Pushpa the rule first half report:

Pushpa 2 Movie updates

Tags:   PUSHPA 2
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ