ఈరోజు రెండు ట్రెండింగ్ టాపిక్స్ సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. అందులో ముందుగా ఈరోజు పెళ్లిపీటలెక్కిన నాగ చైతన్య-శోభితల వివాహం. చైతు సమంతకు విడాకులిచ్చాక శోభితతో ప్రేమాయణం నడిపి ఈరోజు డిసెంబర్ 4 న రెండో పెళ్ళికి సిద్దమయ్యాడు. ఈరోజు రాత్రి చైతు-శోభితల వివాహం జరిగిపోయింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే ట్రెండింగ్ టాపిక్.
ఇక రెండోది వైల్డ్ ఫైర్ పుష్ప ద రూల్ రిలీజ్. పాన్ ఇండియా ప్రేక్షకులంతా పుష్ప 2 ఫీవర్ తో కొట్టుకుంటున్నారు. అల్లు అర్జున్ ఈరోజు రాత్రి 9.30 నిమిషాలకు సంధ్య థియేటర్ లో అభిమానులతో కలిసి పుష్ప 2 వీక్షిస్తున్నారు, సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు అంతా పుష్ప 2 న్యూస్ లు, పుష్ప ప్రీమియర్ టాక్ కోసం పోస్ట్ లు.
ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం పుష్ప ద రూల్ టాక్ తో నిండిపోయింది, విపరీతమైన హైప్ తో ఆడియన్స్ ముందుకు వచ్చేసిన పుష్ప 2 ప్రీమియర్స్ టాక్ షో కోసం ప్రేక్షకులు చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే షోస్ మొదలైపోవడంతో అల్లు అర్జున్ ఎంట్రీ సీన్స్ వీడియోస్ వైరల్ అయ్యాయి.
మరోపక్క నాగ చైతన్య-శోభితల పెళ్లి పిక్స్ కోసం అక్కినేని అభిమానులు వెయిటింగ్ కి నాగార్జున ఎండ్ కార్డు వేశారు. ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం నాగ చైతన్య-శోభితల పెళ్లి ఫోటోలు వైరల్ గా మారాయి, అలాగే అల్లు అర్జున్ పుష్ప 2 పబ్లిక్ టాక్ కోసం ఆడియన్స్ తెగ వెతికేస్తున్నారు. అందుకే అనేది రెండే రెండు ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్స్ అని.